పంత్‌ ఒక్కడే

2022 సంవత్సరానికి గాను ఐసీసీ పురుషుల టెస్టు జట్టులో టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు చోటు లభించింది. భారత్‌ నుంచి ఐసీసీ టెస్టు జట్టులో అతనొక్కడే స్థానం సంపాదించాడు.

Published : 25 Jan 2023 01:45 IST

ఐసీసీ టెస్టు జట్టులో రిషబ్‌కు స్థానం

దుబాయ్‌: 2022 సంవత్సరానికి గాను ఐసీసీ పురుషుల టెస్టు జట్టులో టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు చోటు లభించింది. భారత్‌ నుంచి ఐసీసీ టెస్టు జట్టులో అతనొక్కడే స్థానం సంపాదించాడు. 2022లో 12 ఇన్నింగ్స్‌ల్లో 61.81 సగటుతో పంత్‌ 680 పరుగులు రాబట్టాడు. అందులో రెండు శతకాలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. దూకుడైన నాయకత్వంతో ఇంగ్లాండ్‌ టెస్టు క్రికెట్‌ ముఖచిత్రాన్ని మార్చిన బెన్‌ స్టోక్స్‌ ఐసీసీ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో, జేమ్స్‌ అండర్సన్‌లకు జట్టులో చోటు దక్కింది. పాట్‌ కమిన్స్‌ సహా నలుగురు ఆస్ట్రేలియా నుంచి నలుగురు క్రికెటర్లకు స్థానం లభించింది. దక్షిణాఫ్రికా పేసర్‌ రబాడ, పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌, వెస్టిండీస్‌ సారథి క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ కూడా ఈ జట్టులో ఉన్నారు.

వన్డే జట్టులో అయ్యర్‌, సిరాజ్‌

2022 ఐసీసీ వన్డే జట్టులో టీమ్‌ఇండియా నుంచి శ్రేయస్‌ అయ్యర్‌, మహ్మద్‌ సిరాజ్‌లకు స్థానం లభించింది. నిరుడు 17 వన్డేలాడిన అయ్యర్‌ 55.69 సగటుతో 724 పరుగులు సాధించాడు. అందులో ఒక శతకం, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. సిరాజ్‌ 15 వన్డేల్లో 24 వికెట్లు తీశాడు.

మహిళల బృందంలో మంధాన, హర్మన్‌, రేణుక

ఐసీసీ మహిళల వన్డే జట్టులో ముగ్గురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. 11 మంది సభ్యుల జట్టులో ఓపెనర్‌ స్మృతి మంధానా, కెప్టెన్‌ హర్మర్‌ప్రీత్‌ కౌర్‌, పేసర్‌ రేణుక సింగ్‌ స్థానం సంపాదించారు. 2022లో మంధానా ఒక శతకం, ఆరు అర్ధ సెంచరీలతో సత్తాచాటింది. హర్మన్‌ రెండు శతకాలు, అయిదు అర్ధ సెంచరీలతో మెరిసింది. నిరుడు ఏడు వన్డేలాడిన రేణుక 18 వికెట్లు పడగొట్టింది. భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా నుంచి ముగ్గురు క్రికెటర్లు జట్టులో సంపాదించారు.

ఐసీసీ టెస్టు జట్టు: స్టోక్స్‌ (కెప్టెన్‌), ఖవాజా, క్రెయిన్‌ బ్రాత్‌వైట్‌, లబుషేన్‌, బాబర్‌, బెయిన్‌స్టో, పంత్‌ (వికెట్‌ కీపర్‌), కమిన్స్‌, రబాడ, లైయన్‌, అండర్సన్‌.

ఐసీసీ వన్డే జట్టు: బాబర్‌ (కెప్టెన్‌), హెడ్‌, షై హోప్‌, శ్రేయస్‌, లేథమ్‌ (వికెట్‌ కీపర్‌), సికందర్‌ రజా, మెహిదీ హసన్‌ మిరాజ్‌, అల్జారి జోసెఫ్‌, సిరాజ్‌, బౌల్ట్‌, జంపా.

ఐసీసీ మహిళల వన్డే జట్టు: అలీసా హీలీ (వికెట్‌ కీపర్‌), బెత్‌ మూనీ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌, రేణుక, లారా వోల్వార్డ్‌, అయబొంగా ఖాకా, షబ్నిమ్‌, నాట్‌ సీవర్‌, సోఫీ ఎకిల్‌స్టోన్‌, ఎమీలియా కెర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని