ఐసీసీ టీ20 ఉత్తమ క్రికెటర్‌గా సూర్య

టీమ్‌ఇండియా విధ్వంసకర బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఉత్తమ టీ20 క్రికెటర్‌గా నిలిచాడు. 2022 సంవత్సరానికి గాను ఐసీసీ టీ20 క్రికెటర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు.

Published : 26 Jan 2023 02:08 IST

దుబాయ్‌: టీమ్‌ఇండియా విధ్వంసకర బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఉత్తమ టీ20 క్రికెటర్‌గా నిలిచాడు. 2022 సంవత్సరానికి గాను ఐసీసీ టీ20 క్రికెటర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. సామ్‌ కరన్‌ (ఇంగ్లాండ్‌), మహ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్థాన్‌), సికందర్‌ రజా (జింబాబ్వే)లను వెనక్కినెట్టి అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యాడు. నిరుడు సూర్య 187.43 స్రైక్‌రేటుతో 1164 పరుగులు రాబట్టాడు. టీ20 క్రికెట్లో ఒక ఏడాదిలో 1000 పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మహిళల విభాగంలో భారత జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధానాను వెనక్కినెట్టిన తాలియా మెక్‌గ్రాత్‌ (ఆస్ట్రేలియా) ఉత్తమ టీ20 క్రికెటర్‌గా నిలిచింది. భారత జట్టు పేసర్‌ రేణుక సింగ్‌ ఐసీసీ వర్ధమాన క్రికెటర్‌ అవార్డును కైవసం చేసుకుంది. అవార్డు కోసం పోటీలో నిలిచిన డార్సీ బ్రౌన్‌ (ఆస్ట్రేలియా), ఎలీస్‌ క్యాప్సీ (ఇంగ్లాండ్‌), యాస్తిక భాటియా (భారత్‌)లపై రేణుక పైచేయి సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని