సీనియర్‌ కోచ్‌లకు పద్మశ్రీ

కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో క్రీడా రంగం నుంచి ముగ్గురికి చోటు దక్కింది. ఎస్‌ఆర్‌డీ ప్రసాద్‌ (కేరళ), శానతోయిబా శర్మ (మణిపుర్‌), గుర్‌చరణ్‌ సింగ్‌ (దిల్లీ)ను పద్మశ్రీ అవార్డులు వరించాయి.

Published : 26 Jan 2023 02:09 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో క్రీడా రంగం నుంచి ముగ్గురికి చోటు దక్కింది. ఎస్‌ఆర్‌డీ ప్రసాద్‌ (కేరళ), శానతోయిబా శర్మ (మణిపుర్‌), గుర్‌చరణ్‌ సింగ్‌ (దిల్లీ)ను పద్మశ్రీ అవార్డులు వరించాయి. అథ్లెట్లను కాకుండా ఈ సారి సీనియర్‌ కోచ్‌లను పురస్కారాలకు ఎంపిక చేయడం విశేషం. గుర్‌చరణ్‌ 1986 నుంచి 1987 వరకు టీమ్‌ఇండియా కోచ్‌గా పనిచేశాడు. ఈ మాజీ క్రికెటర్‌ 1987లో ద్రోణాచార్య అవార్డు కూడా అందుకున్నాడు. అనంతరం బీసీసీఐ ప్రారంభించిన పేస్‌ బౌలింగ్‌ అకాడమీకి డైరెక్టర్‌ అయ్యాడు. 100కు పైగా ఫస్ట్‌క్లాస్‌, 12 మంది అంతర్జాతీయ క్రికెటర్లకు అతను శిక్షణనిచ్చాడు. అందులో అజయ్‌ జడేజా, మురళీ కార్తీక్‌ లాంటి మాజీ ఆటగాళ్లున్నారు. కేరళ సంప్రదాయ క్రీడ కళరిపయట్టులో ప్రసాద్‌ ఆరితేరారు. ఈ మార్షల్‌ ఆర్ట్‌ క్రీడలో ఎంతోమందికి శిక్షణ అందించారు. మరోవైపు మణిపుర్‌ సంప్రదాయ క్రీడ తాంగ్‌- టా శిక్షణలో శానతోయిబా పేరు గడించారు. ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి క్రీడా రంగంలో ఒక్కరికీ పురస్కారం రాలేదు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని