ముగింపులో మురిపిస్తుందా!
దాదాపు రెండు దశాబ్దాల గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను ఘనంగా ముగించేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు మంచి అవకాశం.
నేడే సానియా-బోపన్నజోడీ ఫైనల్
ఉదయం 6.30 నుంచి
మెల్‌బోర్న్: దాదాపు రెండు దశాబ్దాల గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను ఘనంగా ముగించేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు మంచి అవకాశం. ఎక్కడైతే కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిందో.. ఇప్పుడు అక్కడే చివరిసారి ట్రోఫీతో వీడ్కోలు పలికేందుకు ఆమె ఓ విజయం దూరంలో ఉంది. రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్ చేరిన సానియా.. శుక్రవారమే గ్రాండ్‌స్లామ్‌లో చివరి మ్యాచ్ ఆడనుంది. సానియా- బోపన్న జోడీ తుదిపోరులో స్టెఫాని- రఫెల్ (బ్రెజిల్) ద్వయంతో తలపడుతుంది. 2009లో మహేష్ భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అదే తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఆ తర్వాత మరో అయిదు (మిక్స్‌డ్ డబుల్స్‌లో రెండు, మహిళల డబుల్స్‌లో మూడు) గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు సొంతం చేసుకుంది. ఈ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆమెకిది అయిదో ఫైనల్. మరి ఏడో టైటిల్‌తో ఆమె గ్రాండ్‌స్లామ్‌కు టాటా చెబుతుందేమో చూడాలి. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీలో అడుగుపెట్టిన ఈ భారత్ జోడీ.. అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ వరకూ వచ్చింది. ‘‘2008లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ చేరా. ఇప్పుడు 2023. గతం గురించి ఆలోచిస్తే కాస్త భయంగా ఉంది. తొలిదైనా లేదా చివరి గ్రాండ్‌స్లామ్ అయినా ప్రతి మ్యాచ్ గెలవాలనే ఆడతా. నా రక్తంలోనే పోటీతత్వం ఉంది. ఆఖరి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ అనే ఆలోచన లేకుండా కోర్టులో అడుగుపెట్టి విజయం సాధించడంపైనే దృష్టి సారిస్తా. మహిళలు అన్ని సాధించగలరూ అని అమ్మాయిలకు తెలిసేలా చేయాలనుకున్నా. ఓ ప్రొఫెషనల్ అథ్లెట్‌గా, ఛాంపియన్‌గా, అమ్మగా.. ఇలా అన్ని రకాలుగా ఉండొచ్చు’’ అని సానియా పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Ramya Krishnan: ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని అడిగా: రమ్యకృష్ణ
-
Politics News
Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
Crime News
Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!
-
Ts-top-news News
Salarjung Museum: సాలార్జంగ్ మ్యూజియం.. ఆన్‌లైన్‌లోనూ వీక్షించొచ్చు..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
‘విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం.. ఏపీ నుంచి ప్రతిపాదనలు రాలేదు’