అమ్మాయిలకు సవాల్‌

మొట్టమొదటి అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు కఠిన పరీక్షకు సిద్ధమయ్యారు. శుక్రవారం సెమీస్‌లో న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా తలపడుతుంది.

Published : 27 Jan 2023 02:44 IST

నేడు సెమీస్‌లో న్యూజిలాండ్‌తో ఢీ

అండర్‌-19 ప్రపంచకప్‌

మధ్యాహ్నం 1.30 నుంచి

పోచెఫ్‌స్ట్రూమ్‌: మొట్టమొదటి అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు కఠిన పరీక్షకు సిద్ధమయ్యారు. శుక్రవారం సెమీస్‌లో న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా తలపడుతుంది. గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచిన భారత్‌కు సూపర్‌ సిక్స్‌ దశలో ఆసీస్‌ చేతిలో ఓటమి ఎదురైంది. కానీ పుంజుకున్న షెఫాలి సేన.. గత మ్యాచ్‌లో శ్రీలంకపై ఘన విజయంతో గ్రూప్‌-1లో అగ్రస్థానంతో సెమీస్‌ చేరింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 87కే కుప్పకూలిన భారత్‌.. ఈ కీలక పోరులో బ్యాటింగ్‌పై దృష్టి సారించాల్సి ఉంది. కెప్టెన్‌ షెఫాలితో పాటు శ్వేత, రిచా, త్రిష రాణించాల్సి ఉంది. బౌలింగ్‌లో స్పిన్నర్లు పర్షవి, మన్నత్‌ కశ్యప్‌ కీలకం కానున్నారు. మరోవైపు కివీస్‌ కూడా పటిష్ఠంగా ఉంది. టోర్నీలో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌లోనూ ఆ జట్టుకు ఓటమే లేదు. సాయంత్రం మరో సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఆస్ట్రేలియా ఢీ కొడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు