క్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌

ఇండోనేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

Published : 27 Jan 2023 02:44 IST

జకార్త: ఇండోనేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్‌ లక్ష్య 19-21, 21-8, 21-17తో జి యంగ్‌ (మలేసియా)పై విజయం సాధించాడు. 61 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఓడిన లక్ష్య తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. రెండో గేమ్‌ను ఏకపక్షంగా ముగించి.. మూడో గేమ్‌లో గొప్ప పోరాట స్ఫూర్తితో ప్రత్యర్థి ఆటకట్టించాడు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో సైనా 15-21, 7-21తో హాన్‌ యూ (చైనా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో- అశ్విని పొన్నప్ప జోడీ క్వార్టర్స్‌ చేరుకుంది. ప్రిక్వార్టర్స్‌లో తనీషా- అశ్విని జోడీ 19-21, 21-18, 23-21తో మయసరి- సుగియార్తో (ఇండోనేసియా) జంటపై గెలుపొందింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు