రెజ్లర్లకు పచ్చజెండా

పర్యవేక్షక కమిటీ ఎంపిక చేసిన రెజర్ల బృందానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 1న ఆరంభమయ్యే జాగ్రిబ్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు భారత జట్టుకు అనుమతి ఇచ్చింది.

Published : 27 Jan 2023 02:44 IST

దిల్లీ: పర్యవేక్షక కమిటీ ఎంపిక చేసిన రెజర్ల బృందానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 1న ఆరంభమయ్యే జాగ్రిబ్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు భారత జట్టుకు అనుమతి ఇచ్చింది. 36 మంది రెజర్లతో పాటు మొత్తం 55 మంది సభ్యుల బృందం ఈ టోర్నీకి వెళ్లనుంది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ శరణ్‌ను తొలగించాలంటూ నిరసనకు దిగిన వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పూనియా, రవి కుమార్‌ దహియా, అన్షు మలిక్‌ భారత జట్టులో ఉన్నారు. బ్రిజ్‌ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టడంతో సమాఖ్య కార్యకలాపాలు చూసుకునేందుకు కేంద్రం పర్యవేక్షక కమిటీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. మేరీకోమ్‌ సారథ్యంలోని ఈ కమిటీ నెలలోపు నివేదిక సమర్పించాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు