డబుల్స్‌లో అదుర్స్‌..

కెరీర్‌ ఆరంభంలో సింగిల్స్‌ క్రీడాకారిణిగా దేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సానియా.. డబుల్స్‌లో అంతకుమించి ప్రదర్శన చేసింది.

Published : 28 Jan 2023 01:56 IST

కెరీర్‌ ఆరంభంలో సింగిల్స్‌ క్రీడాకారిణిగా దేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సానియా.. డబుల్స్‌లో అంతకుమించి ప్రదర్శన చేసింది. మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కలిపి ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో మేటిగా నిలిచింది. నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ జయకేతనం ఎగురవేసింది. మణికట్టు గాయంతో 2013 నుంచి పూర్తిగా డబుల్స్‌పైనే దృష్టి సారించింది. అంతకంటే ముందే మహేష్‌ భూపతితో కలిసి రెండు మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిళ్లు సాధించింది. 2009 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌తో కొత్త శకానికి నాంది పలికింది.  2015లో స్విస్‌ దిగ్గజం మార్టినా హింగిస్‌తో జతకట్టిన సానియా మహిళల డబుల్స్‌లో అద్భుతమే చేసింది. పరస్పర అవగాహన, ఆత్మవిశ్వాసంతో ఈ జోడీ వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు ఖాతాలో వేసుకుంది. 2015లో వింబుల్డన్‌, యుఎస్‌ ఓపెన్‌ గెలిచిన ఈ జంట.. 2016లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ట్రోఫీని ముద్దాడింది.


టైటిళ్లు..

* మిక్స్‌డ్‌ డబుల్స్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (2009), ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2012), యుఎస్‌ ఓపెన్‌ (2014)

* మహిళల డబుల్స్‌.. వింబుల్డన్‌, యుఎస్‌ ఓపెన్‌ (2015), ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (2016)Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు