ఫైనల్లో జర్మనీ, బెల్జియం

పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో సంచలనం. ప్రపంచ నంబర్‌వన్‌ ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జర్మనీ అయిదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.

Published : 28 Jan 2023 01:56 IST

భువనేశ్వర్‌: పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో సంచలనం. ప్రపంచ నంబర్‌వన్‌ ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జర్మనీ అయిదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం సెమీస్‌లో 4-3తో ఆ జట్టు గెలిచింది. ఓ దశలో 0-2తో ఓటమి దిశగా సాగిన ఆ జట్టు.. ఆఖర్లో అద్భుతమే చేసింది. స్టార్‌ డ్రాగ్‌ఫ్లికర్‌ గొంజాలో పీలట్‌ (42వ, 51వ, 58వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌తో సత్తాచాటాడు. మరికొన్ని సెకన్ల ఆట మాత్రమే మిగిలి ఉందనగా నిక్లాస్‌ (59వ) గోల్‌ చేసి జర్మనీని గెలిపించాడు. ఆస్ట్రేలియా తరపున హేవర్డ్‌ (11వ), నాథన్‌ (26వ), గోవర్స్‌ (57వ) తలో గోల్‌ కొట్టారు. మరో సెమీస్‌లో పెనాల్టీ షూటౌట్లో 3-2తో నెదర్లాండ్స్‌పై డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెల్జియం విజయం సాధించింది. ఆదివారం ఫైనల్‌ జరుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు