సాహో సానియా..
దాదాపు రెండు దశాబ్దాల గ్రాండ్‌స్లామ్ ప్రయాణం మదిలో మెదులుతుంటే.. ఉబికి వస్తున్న కన్నీళ్లతో.. భావోద్వేగ వాతావరణంలో.. సానియా మీర్జా వీడ్కోలు పలికింది.
గ్రాండ్‌స్లామ్ కెరీర్‌కు మీర్జా గుడ్‌బై
ఆఖరి టోర్నీలో రన్నరప్ ట్రోఫీ
దాదాపు రెండు దశాబ్దాల గ్రాండ్‌స్లామ్ ప్రయాణం మదిలో మెదులుతుంటే.. ఉబికి వస్తున్న కన్నీళ్లతో.. భావోద్వేగ వాతావరణంలో.. సానియా మీర్జా వీడ్కోలు పలికింది. జూనియర్‌గా.. టీనేజర్‌గా.. అమ్మాయిగా.. అమ్మగా.. గ్రాండ్‌స్లామ్‌ల్లో ఆడిన ఆమె.. ఇప్పుడు ఆ చిరస్మరణీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. ఆరు డబుల్స్ టైటిళ్లు.. ఎన్నో జ్ఞాపకాలతో ప్రస్థానాన్ని ముగించింది. ప్రొఫెషనల్ బాటలో తొలి అడుగు వేసిన మెల్‌బోర్న్‌లోనే.. ఆఖరి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ ఫైనల్లో బోపన్నతో కలిసి ఫైనల్ చేరిన ఆమె.. తుది సమరంలో గెలవలేకపోయింది. అయినా తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌కు ఇది ఘనమైన ముగింపే!
మెల్‌బోర్న్
ఇవి ఆనంద భాష్పాలు. నా ప్రొఫెషనల్ కెరీర్ మెల్‌బోర్న్‌లోనే ఆరంభమైంది. కొన్ని టైటిళ్లూ గెలిచా. రాడ్ లేవర్ ఎరీనా నా జీవితంలో ప్రత్యేకమైంది. గ్రాండ్‌స్లామ్ కెరీర్ ముగింపునకు ఇంతకంటే ఉత్తమ వేదిక ఉండదు. నా తనయుడి ఎదురుగా ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడతానని ఊహించలేదు.
- సానియా
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ రన్నరప్ ట్రోఫీతో గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను సానియా మీర్జా ముగించింది. శుక్రవారం ఫైనల్లో సానియా- బోపన్న జోడీ 6-7 (2-7), 2-6 తేడాతో లూయిసా స్టెఫాని- రఫెల్ మాటాస్ (బ్రెజిల్) చేతిలో పరాజయం పాలైంది. యువ జంటతో పోరులో తొలి సెట్లో భారత సీనియర్ ద్వయం గట్టిగా పోరాడింది. తొలి రెండు గేమ్‌లు కోల్పోయిన తర్వాత సానియా- మీర్జా జోడీ పుంజుకుంది. విన్నర్లు, ఏస్‌లతో సత్తాచాటి వరుసగా మూడు గేమ్‌లు గెలిచి 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓ తప్పిదంతో తర్వాతి గేమ్ కోల్పోయినప్పటికీ.. ఎనిమిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 5-3తో దూసుకెళ్లింది. కానీ సెట్ పాయింట్‌ను కాపాడుకోలేకపోయింది. బోపన్న సర్వీస్‌లో వేగం తగ్గడం, కోర్టులో చురుగ్గా కదల్లేకపోవడంతో భారత జోడీ వెనకబడింది. తొమ్మిదో గేమ్‌లో సర్వీస్ కోల్పోయింది. 6-5తో నిలిచినప్పుడూ ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయలేకపోయింది. దీంతో 6-6తో స్కోరు సమమై టైబ్రేకర్ అనివార్యమైంది. అందులో సానియా జోడీ పూర్తిగా నిరాశపర్చింది. రెండో సెట్లో 1-4తో వెనకబడ్డ సానియా- బోపన్న జోడీ ఇక కోలుకోలేదు. మరో గేమ్ మాత్రమే గెలిచిన ఈ జంట.. చివరకు మ్యాచ్ చేజార్చుకుంది. ఈ పోరులో ప్రత్యర్థితో సమానంగా ఏస్‌లు (చెరో 4) కొట్టిన భారత జోడీ.. రెండు విన్నర్లు ఎక్కువే సంధించింది. బ్రెజిల్ ద్వయం 18 విన్నర్లు కొట్టగా.. భారత జంట 20 సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/10/2023)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్