ఆదివారం.. ఆటలే ఆటలు

ఆదివారం క్రీడాభిమానులకు బోలెడంత వినోదం. వివిధ క్రీడల్లో కీలక మ్యాచ్‌లు అలరించబోతున్నాయి. అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత జట్టు ఇంగ్లాండ్‌ను ఢీకొనబోతుండడంతో.. అమ్మాయిల క్రికెట్లో దేశానికి తొలి కప్పు అందుతుందా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Published : 29 Jan 2023 02:26 IST

దివారం క్రీడాభిమానులకు బోలెడంత వినోదం. వివిధ క్రీడల్లో కీలక మ్యాచ్‌లు అలరించబోతున్నాయి. అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత జట్టు ఇంగ్లాండ్‌ను ఢీకొనబోతుండడంతో.. అమ్మాయిల క్రికెట్లో దేశానికి తొలి కప్పు అందుతుందా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. భారత క్రీడాకారులు లేకపోయినా.. ఆదివారం ఇంకో రెండు ఫైనల్స్‌ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నాదల్‌ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల (22) రికార్డును సమం చేయడమే లక్ష్యంగా జకోవిచ్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో సిట్సిపాస్‌ను ఢీకొనబోతున్నాడు. ఇక భారత్‌ ఆతిథ్యమిస్తున్న హాకీ ప్రపంచకప్‌లో మేటి జట్లు జర్మనీ, బెల్జియం టైటిల్‌ కోసం తలపడనున్నాయి. మరోవైపు భారత పురుషుల క్రికెట్‌ జట్టు.. న్యూజిలాండ్‌తో కీలకమైన రెండో టీ20 ఆడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు