భారత్‌కు తొమ్మిదో స్థానం

సంయుక్తంగా తొమ్మిదో స్థానంతో భారత్‌ హాకీ ప్రపంచకప్‌ను ముగించింది. శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ 5-2 గోల్స్‌తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.

Published : 29 Jan 2023 02:34 IST

రవుర్కెలా: సంయుక్తంగా తొమ్మిదో స్థానంతో భారత్‌ హాకీ ప్రపంచకప్‌ను ముగించింది. శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ 5-2 గోల్స్‌తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. భారత్‌ తరఫున అభిషేక్‌ (4వ), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (11వ), షంషేర్‌ సింగ్‌ (44వ), ఆకాశ్‌దీప్‌ (48వ), సుఖ్‌జీత్‌ (58వ) తలో గోల్‌ కొట్టారు. దక్షిణాఫ్రికా జట్టులో సంకేలో (48వ), ముస్తఫా (59వ) చెరో గోల్‌ సాధించారు. మరో మ్యాచ్‌లో అర్జెంటీనా 6-0తో వేల్స్‌ను చిత్తు చేసింది. ఆ జట్టు భారత్‌తో తొమ్మిదో స్థానాన్ని పంచుకుంది. 1998, 2014లో కూడా భారత్‌ తొమ్మిదో స్థానంలో నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు