గుజరాత్‌ మార్గనిర్దేశకురాలిగా మిథాలి

భారత మహిళల క్రికెట్‌ దిగ్గజం మిథాలీరాజ్‌ కొత్త పాత్రలో కనిపించబోతోంది. ఈ సీజన్లో ఆరంభమయ్యే తొట్టతొలి మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌కు మిథాలి మార్గనిర్దేశకురాలిగా వ్యవహరించనుంది.

Published : 29 Jan 2023 02:34 IST

అహ్మదాబాద్‌: భారత మహిళల క్రికెట్‌ దిగ్గజం మిథాలీరాజ్‌ కొత్త పాత్రలో కనిపించబోతోంది. ఈ సీజన్లో ఆరంభమయ్యే తొట్టతొలి మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌కు మిథాలి మార్గనిర్దేశకురాలిగా వ్యవహరించనుంది. అంతేకాక ఈ బాధ్యతల్లో భాగంగా గుజరాత్‌లో అమ్మాయిల క్రికెట్‌ అభివృద్ధికి కూడా 40 ఏళ్ల మిథాలి తోడ్పాటు అందించనుంది. గుజరాత్‌ జెయింట్స్‌ జట్టును అదానీ గ్రూప్‌ రూ.1289 కోట్లతో కొనుక్కుంది. ‘‘భారత్‌లో మహిళల క్రికెట్‌ అభివృద్ధికి ఉమెన్స్‌ ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఓ గొప్ప ఎత్తుగడ. మహిళల క్రికెట్‌ స్థిరంగా ఎదుగుతోంది. ఈ ఆటను వృత్తిగా తీసుకునేందుకు అమ్మాయిలకు ఈ లీగ్‌ ప్రోత్సాహాన్ని అందించనుంది’’ అని మిథాలి పేర్కొంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మిథాలి.. గతేడాది 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని