22.. పట్టేస్తాడా?

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో అగ్రస్థానంలో ఉన్న నాదల్‌ (22)ను సమం చేసేందుకు.. రికార్డు స్థాయిలో పదో సారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచేందుకు.. మరోసారి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకుకు చేరేందుకు.. జకోవిచ్‌ ఒక్క విజయం దూరంలో ఉన్నాడు.

Updated : 29 Jan 2023 05:03 IST

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో సిట్సిపాస్‌తో జకోవిచ్‌ ఢీ
నేడు మధ్యాహ్నం 2 గంటల తర్వాత

త్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో అగ్రస్థానంలో ఉన్న నాదల్‌ (22)ను సమం చేసేందుకు.. రికార్డు స్థాయిలో పదో సారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచేందుకు.. మరోసారి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకుకు చేరేందుకు.. జకోవిచ్‌ ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. మరి నాదల్‌ను అతను అందుకుంటాడా? లేదా? అన్నది నేడే తేలిపోనుంది. ఆదివారం పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఈ నాలుగో సీడ్‌ సెర్బియా ఆటగాడు.. మూడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)తో తలపడబోతున్నాడు. మరోవైపు ఈ టోర్నీలో తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించిన 24 ఏళ్ల సిట్సిపాస్‌.. గ్రాండ్‌స్లామ్‌ బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ టైటిల్‌ పోరులో అతను విజేతగా నిలిచినా నంబర్‌వన్‌ ర్యాంకుకు చేరుకుంటాడు. ఈ మ్యాచ్‌లో 35 ఏళ్ల జకోవిచ్‌ టైటిల్‌ ఫేవరెట్‌్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టోర్నీలో సెమీస్‌, ఫైనల్లో అతను ఓడిందే లేదు. ఇప్పటివరకూ 9 సార్లు ఇక్కడ జయకేతనం ఎగరవేశాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో గత 27 మ్యాచ్‌ల్లో అతనికి ఓటమన్నదే లేదు. మొత్తంగా కంగారూ గడ్డపై వరుసగా 40 మ్యాచ్‌లు గెలిచాడు. పైగా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 2020 సెమీస్‌, 2021 ఫైనల్లో సిట్సిపాస్‌పై జకోనే గెలిచాడు. అప్పుడు తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలవకుండా సిట్సిపాస్‌కు అడ్డుగా నిలిచిన అతను.. ఇప్పుడూ రెండో ఫైనల్లో ప్రత్యర్థిగా ఉన్నాడు. మొత్తం మీద సిట్సిపాస్‌తో 12 మ్యాచ్‌లాడిన జకో.. 10 విజయాలు సాధించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు