సబలెంక.. సాధించెన్
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్. ఈ ఏడాది ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ ఒక్క సెట్ కూడా కోల్పోకుండా గెలిచిన సబలెంక ఒకవైపు. టాప్‌సీడ్ స్వైటెక్‌తో సహా అగ్రశ్రేణి క్రీడాకారిణిలను ఓడించి తుదిపోరు చేరిన రిబకినా మరోవైపు.
తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సొంతం
ఫైనల్లో రిబకినాపై గెలుపు
ఆస్ట్రేలియన్ ఓపెన్ కైవసం
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్. ఈ ఏడాది ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ ఒక్క సెట్ కూడా కోల్పోకుండా గెలిచిన సబలెంక ఒకవైపు. టాప్‌సీడ్ స్వైటెక్‌తో సహా అగ్రశ్రేణి క్రీడాకారిణిలను ఓడించి తుదిపోరు చేరిన రిబకినా మరోవైపు. ఈ టోర్నీలో ఇద్దరికీ ఇదే తొలి ఫైనల్. పోరు మొదలైంది. గంటకు 190 కిలోమీటర్లకు పైగా వేగంతో సర్వ్‌లు, ఒకరిని మించి మరొకరు.. ఏస్‌లు, కళ్లు చెదిరే విన్నర్లతో సివంగుల్లా తలపడ్డారు. తొలి సెట్ రిబకినాదే. తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కోసం సబలెంకాకు నిరీక్షణ తప్పదేమోనన్న అంచనాలు. కానీ బెలారస్ భామ వదల్లేదు. తర్వాతి రెండు సెట్లలో అద్భుతమైన ఆటతీరుతో.. ఘనంగా గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ బోణీ కొట్టింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ కొత్త ఛాంపియన్ అరీనా సబలెంక. గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో తొలిసారి ఫైనల్ చేరిన ఈ 24 ఏళ్ల అమ్మాయి.. తొలి సెట్ కోల్పోయినా తిరిగి పుంజుకుని టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. శనివారం తుదిపోరులో ఈ అయిదో సీడ్ క్రీడాకారిణి 4-6, 6-3, 6-4 తేడాతో వింబుల్డన్ ఛాంపియన్ రిబకినా (కజకిస్థాన్)పై విజయం సాధించింది. శక్తిమంతమైన సర్వీస్‌లతో చెలరేగిన సబలెంక.. రాకెట్‌పై పూర్తి నియంత్రణతో, కచ్చితమైన ప్రదేశంలోకి బంతిని పంపిస్తూ పాయింట్లు రాబట్టింది. కానీ తొలి సెట్లో ఆధిపత్యం మాత్రం 22వ సీడ్ రిబకినాదే. మూడో గేమ్‌లో ప్రత్యర్థి అనవసర తప్పిదంతో బ్రేక్ పాయింట్ సాధించిన రిబకినా, ఆపై 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఎనిమిదో గేమ్‌లో బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో తొలి బ్రేక్ పాయింట్ సాధించిన సబలెంక 4-4తో స్కోరు సమం చేసింది. కానీ తర్వాతి గేమ్‌లో డబుల్ ఫాల్ట్‌తో సర్వీస్ కోల్పోవడం ఆమెను దెబ్బతీసింది. పదో గేమ్‌లో సర్వీస్ నిలబెట్టుకున్న రిబకినా తొలి సెట్ నెగ్గింది. రెండో గేమ్‌లో సబలెంక దూకుడు ప్రదర్శించింది. ఏస్‌లు, విన్నర్లతో విరుచుకుపడింది. ముఖ్యంగా చూడముచ్చటైన బ్యాక్‌హ్యాండ్ షాట్లతో అలరించింది. చూస్తుండగానే 4-1తో దూసుకెళ్లింది. అదే ఊపులో వరుసగా రెండు ఏస్‌లతో రెండో సెట్‌ను నెగ్గింది. నిర్ణయాత్మక మూడో సెట్ హోరాహోరీగా సాగింది. స్కోరు 3-3తో సమమైన దశలో బ్రేక్ పాయింట్ సాధించడం సబలెంకకు కలిసొచ్చింది. తర్వాతి గేమ్నూ సొంతం చేసుకున్న ఆమె 5-3తో పైచేయి సాధించింది. ఆ వెంటనే రిబకినా ఓ గేమ్ నెగ్గినా.. పదో గేమ్‌లో పట్టువదలకుండా పోరాడిన సబలెంక సెట్‌తో పాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిళ్లను అలెగ్జాండర్ బ్లాక్ (బెల్జియం), అలీనా కోర్నీవా (రష్యా) దక్కించుకున్నారు.
తొలి తటస్థ క్రీడాకారిణిగా..
సింగిల్స్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన సబలెంక జాతీయ పతాకంతో సంబరాలు చేసుకోలేకపోయింది. అందుకు ప్రత్యేక కారణం ఉంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యా, బెలారస్ ప్లేయర్లను ఈ గ్రాండ్‌స్లామ్‌లో వాళ్ల దేశాల తరపున ప్రాతినిథ్యం వహించకుండా నిషేధించారు. ఆయా దేశాల జాతీయ పతాకాలను ప్రదర్శించడానికి నిరాకరించారు. కానీ వీళ్లు తటస్థ ప్లేయర్లుగా పోటీపడొచ్చు. ఇప్పుడు బెలారస్‌కు చెందిన సబలెంక.. ఇలాగే బరిలో దిగి విజేతగా నిలిచింది. దీంతో టెన్నిస్ చరిత్రలో తటస్థ క్రీడాకారిణిగా ఆడి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన తొలి ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. మరోవైపు రష్యాలో పుట్టిన రిబకినా.. కజకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది. టెన్నిస్ కెరీర్‌కు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఆ దేశం ముందుకు రావడంతో ఆమె 2018 నుంచి కజకిస్థాన్‌కు ఆడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్‌కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్‌లో అత్యుత్తమ కోచ్‌ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్‌పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్‌దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్‌లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్‌రైడర్స్ కోచ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్‌కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్‌కతా నైట్‌రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా