IND Vs NZ: గెలవాల్సిందే..
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేశాక, తొలి టీ20లో కంగుతిన్న టీమ్‌ఇండియా.. సిరీస్‌పై ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తలపడబోతోంది. కివీస్‌తో రెండో టీ20 ఆదివారమే.
నేడు కివీస్‌తో భారత్ రెండో టీ20
రాత్రి 7 నుంచి
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేశాక, తొలి టీ20లో కంగుతిన్న టీమ్‌ఇండియా.. సిరీస్‌పై ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తలపడబోతోంది. కివీస్‌తో రెండో టీ20 ఆదివారమే.
మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభ పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌కు రాంచిలో కివీస్ పెద్ద షాకే ఇచ్చింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ హార్దిక్ సేన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. బౌలింగ్‌లో లభించిన మంచి ఆరంభాన్ని ఉపయోగించుకోలేక ప్రత్యర్థితో 170 పైచిలుకు స్కోరు చేయించిన టీమ్‌ఇండియా.. ఆ తర్వాత ఛేదనలో తేలిపోయింది. సూర్యకుమార్, వాషింగ్టన్ సుందర్ పోరాడకుంటే భారత్‌కు ఘోర పరాభవం ఎదురయ్యేదే.
ఆ ముగ్గురిపై దృష్టి: టీ20ల్లో భారత్ నిలకడగానే విజయాలు సాధిస్తున్నప్పటికీ.. ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం నిలకడగా లేదు. ప్రపంచకప్ వైఫల్యం తర్వాత సీనియర్లు రోహిత్, కోహ్లి, రాహుల్ టీ20 జట్టుకు దూరంగా ఉండగా, వారి స్థానాల్లో ఆడుతున్న కుర్రాళ్లు అవకాశాలను సద్వినియోగం చేసుకోవట్లేదు. ఇషాన్ కిషన్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి నిలకడ అందుకోలేకపోతున్నారు. త్రిపాఠి ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు కానీ.. మిగతా ఇద్దరికీ బాగానే అవకాశాలు వచ్చాయి. బంగ్లాదేశ్‌పై వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీని మినహాయిస్తే ఇషాన్ ప్రదర్శన సాధారణం. కివీస్‌తో వన్డేల్లో వరుసగా 5, 8, 17 పరుగులే చేసిన అతను.. తొలి టీ20లో 4 పరుగులకే వెనుదిరిగాడు. దీపక్ హుడా కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి చాన్నాళ్లయింది. శుభ్‌మన్ గిల్ సైతం వన్డేల్లో మాదిరి టీ20ల్లో రాణించలేకపోతున్నాడు. రెండో టీ20లో వీళ్లందరూ దూకుడు చూపించాల్సిందే. వ్యక్తిగత ప్రదర్శన, నాయకత్వ వ్యూహాల విషయంలో హార్దిక్ పాండ్య కూడా మెప్పించలేకపోతున్నాడు. సిరీస్ ఫలితాన్ని నిర్దేశించే మ్యాచ్‌లో అతను అన్ని రకాలుగా సత్తా చాటాల్సిందే. వన్డేల్లో విఫలమైనా టీ20లకు వచ్చేసరికి సూర్యకుమార్ జోరందుకోవడం సానుకూలాంశం. వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండ్ మెరుపులతో ఆకట్టుకున్నాడు. మరో స్పిన్నర్ కుల్‌దీప్ చక్కటి ఫామ్‌ను కొనసాస్తుండగా.. పేసర్ అర్ష్‌దీప్ ఉన్నట్లుండి లయ కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్రాన్ మాలిక్ కూడా నిలకడగా రాణించలేకపోతున్నాడు. ఇక కివీస్ వన్డే సిరీస్ చేదు గురుతులను చెరిపివేస్తూ తొలి టీ20లో సత్తా చాటింది. ఓపెనర్లు కాన్వే, అలెన్‌లతో పాటు ఆల్‌రౌండర్ మిచెల్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించగా.. బౌలర్లందరూ సమష్టిగా సత్తా చాటారు. విజయోత్సాహంలో ఉన్న కివీస్‌ను సిరీస్ సాధించకుండా ఆపాలంటే భారత్ గట్టిగా పోరాడాల్సిందే. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న లఖ్‌నవూ స్టేడియం బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా సహకరిస్తుందని అంచనా.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rohit - IPL: ఐపీఎల్లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: సారా అలీఖాన్ ‘పింక్’ మూడ్.. తుపాకీ పట్టిన లక్ష్మీరాయ్!
-
Crime News
Hyderabad: అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు
-
General News
Polavaram: ‘పోలవరం’ ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం: కేంద్రం
-
Movies News
Shakuntalam: అప్పటి నుంచే నా సినిమాల్లో నిజమైన బంగారు ఆభరణాలు వాడుతున్నా: గుణశేఖర్
-
Politics News
Revanth Reddy: లీకేజీ వ్యవహారం.. కేటీఆర్ నుంచి ఎందుకు సమాచారాన్ని సేకరించలేదు?: రేవంత్