343.. ఛేదంచేశారు

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య దక్షిణాఫ్రికా మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఆదివారం రెండో వన్డేలో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గింది.

Published : 30 Jan 2023 02:13 IST

బ్లూమ్‌ఫౌంటైన్‌: ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య దక్షిణాఫ్రికా మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఆదివారం రెండో వన్డేలో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట ఇంగ్లిష్‌ జట్టు 342/7 స్కోరు చేసింది. బట్లర్‌ (94), బ్రూక్‌ (80), మొయిన్‌ అలీ (51) రాణించారు. ఛేదనలో కెప్టెన్‌ బవుమా (109) మెరవడంతో లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. డికాక్‌ (31), వాండర్‌డసెన్‌ (38)లతో బవుమా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ ముగ్గురూ ఔటయ్యాక  మార్‌క్రమ్‌ (49), మిల్లర్‌ (58 నాటౌట్‌), జాన్సన్‌ (32 నాటౌట్‌) మిగతా పని పూర్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు