IND vs NZ: వందే అనుకుంటే.. స్వల్ప ఛేదనలో కష్టపడ్డ భారత్
లఖ్‌నవూలో స్పిన్ హవా. బంతి గిర్రున తిరుగుతున్న పిచ్‌పై బ్యాటర్లకు పరుగులు రాబట్టడం గగనమే అయింది. వంద పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి టీమ్‌ఇండియా ఆపసోపాలు పడాల్సి వచ్చింది.
రెండో టీ20లో కివీస్‌పై విజయం
లఖ్‌నవూ
లఖ్‌నవూలో స్పిన్ హవా. బంతి గిర్రున తిరుగుతున్న పిచ్‌పై బ్యాటర్లకు పరుగులు రాబట్టడం గగనమే అయింది. వంద పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి టీమ్‌ఇండియా ఆపసోపాలు పడాల్సి వచ్చింది. అత్యంత కఠినమైన పిచ్‌పై చివరికి భారత్‌దే పైచేయి అయినా.. కివీస్ పోరాటమూ ఆకట్టుకుంది. ఈ విజయంతో టీమ్‌ఇండియా సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
బ్యాటింగ్ చాలా కష్టమైన పిచ్‌పై రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. భారత బౌలర్ల ధాటికి మొదట న్యూజిలాండ్ 8 వికెట్లకు 99 పరుగులే చేయగలిగింది. శాంట్నర్ (19 నాటౌట్; 23 బంతుల్లో 1×4) టాప్ స్కోరర్. లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (26 నాటౌట్) పోరాడాడు. మ్యాచ్‌లో ఒక్క సిక్స్ కూడా రాలేదంటే పిచ్ బ్యాటింగ్‌కు ఎంత కష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విధ్వంసక వీరుడు సూర్య కూడా 31 బంతుల్లో ఒకే ఒక్క ఫోరే కొట్టగలిగాడు.
చెమటోడ్చిన బ్యాటర్లు: బంతి గిర్రున తిరుగుతున్న పిచ్‌పై స్పిన్నర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు చాలా కష్టమైపోయింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్‌ను సరిగా అర్థం చేసుకున్న భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగింది. పైగా దీపక్ హుడా కూడా ఉన్నాడు. సుందర్ బౌలింగ్ దాడిని ఆరంభించాడు. చాహల్ (1/4; 2 ఓవర్లలో) నాలుగో ఓవర్లోనే అలెన్‌ను ఔట్ చేయడం ద్వారా కివీస్ పతనాన్ని ఆరంభించాడు. అక్కడి నుంచి ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. హుడా (1/17), కుల్‌దీప్ (1/17), సుందర్ (1/17, 3 ఓవర్లలో) బ్యాటర్లకు ఏమాత్రం బ్యాట్ ఝుళిపించే అవకాశం ఇవ్వలేదు. శాంట్నర్ కాస్త నిలబడడంతో కివీస్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో అర్ష్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో భారత బ్యాటర్లు కూడా పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు. స్పిన్నర్లను ఎదుర్కోవడం చాలా కష్టమైపోయింది. గిల్ (11) నాలుగో ఓవర్లోనే ఔట్ కాగా.. 9వ ఓవర్లో ఇషాన్ కిషన్ (19; 32 బంతుల్లో 2×4) ఔటయ్యేప్పటికి స్కోరు 46 పరుగులే.త్రిపాఠి (13), సుందర్ (10) తక్కువ స్కోరుకే వెనుదిరగగా.. క్రీజులో నిలిచిన సూర్య చెమటోడ్చాడు. ఒత్తిడిలో హార్దిక్ (15 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. సింగిల్స్‌తోనే స్కోరు బోర్డు ముందుకు సాగింది. చివరి ఓవర్లో 6 పరుగులు అవసరమవగా టిక్నర్ తొలి నాలుగు బంతుల్లో మూడు పరుగులే ఇవ్వడంతో ఉత్కంఠ తీవ్రమైంది. కానీ అయిదో బంతిని సూర్య బౌండరీకి తరలించడంతో భారత్ విజయాన్నందుకుంది. బ్రాస్‌వెల్ (1/13), ఇష్ సోధి (1/24), శాంట్నర్ (0/20), ఫిలిప్స్ (0/17) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (బి) చాహల్ 11; కాన్వే (సి) ఇషాన్ (బి) సుందర్ 11; చాప్‌మన్ రనౌట్ 14; ఫిలిప్స్ (బి) హుడా 5; మిచెల్ (బి) కుల్‌దీప్ 8; బ్రాస్‌వెల్ (సి) అర్ష్‌దీప్ (బి) హార్దిక్ 14; శాంట్నర్ నాటౌట్ 19; ఇష్ సోధి (సి) హార్దిక్ (బి) అర్ష్‌దీప్ 1; ఫెర్గూసన్ (సి) సుందర్ (బి) అర్ష్‌దీప్ 0; డఫి నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 99; వికెట్ల పతనం: 1-21, 2-28, 3-35, 4-48, 5-60, 6-80, 7-83, 8-83; బౌలింగ్: హార్దిక్ 4-0-25-1; సుందర్ 3-0-17-1; చాహల్ 2-1-4-1; హుడా 4-0-17-1; కుల్‌దీప్ 4-0-17-1; అర్ష్‌దీప్ 2-0-7-2; మావి 1-0-11-0
భారత్ ఇన్నింగ్స్: గిల్ (సి) అలెన్ (బి) బ్రాస్‌వెల్ 11; ఇషాన్ రనౌట్ 19; త్రిపాఠి (సి) ఫిలిప్స్ (బి) సోధి 13; సూర్యకుమార్ నాటౌట్ 26; సుందర్ రనౌట్ 10; హార్దిక్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 101; వికెట్ల పతనం: 1-17, 2-46, 3-50, 4-70; బౌలింగ్: డఫి 1-0-8-0; బ్రాస్‌వెల్ 4-0-13-1; శాంట్నర్ 4-0-20-0; ఫిలిప్స్ 4-0-17-0; ఇష్ సోధి 4-0-24-1; చాప్‌మన్ 1-0-4-0; ఫెర్గూసన్ 1-0-7-0; టిక్నర్ 0.5-0-7-0
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
pathaan ott: ఓటీటీలో షారుఖ్ ‘పఠాన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Movies News
Vennira Aadai Nirmala: మా ఇంటికి హీరో తాగొచ్చి.. రాద్ధాంతం చేశాడు: సీనియర్ నటి
-
Sports News
Umran - Ishant: బ్యాటర్లు భయపడేలా.. ఇంకా వేగం పెంచు : ఉమ్రాన్‌కు ఇషాంత్ సలహా
-
World News
Imran Khan: నన్ను కోర్టులోనే చంపేస్తారేమో: ఇమ్రాన్ ఖాన్
-
Movies News
Ramya Krishnan: ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని అడిగా: రమ్యకృష్ణ
-
Politics News
Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు