ఐసీసీ జట్టులో షెఫాలి, శ్వేత, పార్శవి

ఐసీసీ అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌లో ప్రదర్శన ఆధారంగా ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ను ప్రకటించింది.

Published : 31 Jan 2023 02:52 IST

దుబాయ్‌: ఐసీసీ అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌లో ప్రదర్శన ఆధారంగా ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ను ప్రకటించింది. భారత్‌ నుంచి కెప్టెన్‌ షెఫాలి వర్మ, ఆమె ఓపెనింగ్‌ భాగస్వామి శ్వేత సహ్రావత్‌, లెగ్‌స్పిన్నర్‌ పార్శవి చోప్రాలకు ఇందులో చోటు దక్కింది. షెఫాలి నేతృత్వంలోని భారత జట్టు టోర్నీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. చెలరేగి ఆడిన షెఫాలి టోర్నీలో 172 పరుగులు సాధించింది. 5.04 ఎకానమితో నాలుగు వికెట్లు కూడా పడగొట్టింది. శ్వేత 99 సగటుతో 297 పరుగులు చేసింది. ఇక పార్శవి 11 వికెట్లు చేజిక్కించుకుంది. ఐసీసీ జట్టుకు ఇంగ్లాండ్‌కు చెందిన స్క్రివెన్స్‌ కెప్టెన్‌గా ఎంపికైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని