భారత హాకీ కోచ్‌ రీడ్‌ రాజీనామా

హాకీ ప్రపంచకప్‌లో భారత వైఫల్యం నేపథ్యంలో కోచ్‌ గ్రాహం రీడ్‌ పదవికి రాజీనామా చేశాడు. కోచ్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీకి లేఖ సమర్పించాడు.

Published : 31 Jan 2023 02:52 IST

దిల్లీ: హాకీ ప్రపంచకప్‌లో భారత వైఫల్యం నేపథ్యంలో కోచ్‌ గ్రాహం రీడ్‌ పదవికి రాజీనామా చేశాడు. కోచ్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీకి లేఖ సమర్పించాడు. ‘‘హాకీ ప్రపంచకప్‌లో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ వైదొలగడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నా. హాకీ ఇండియాతో కలిసి పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. భారత జట్టుతో ఈ ప్రయాణాన్ని ప్రతి క్షణం ఆస్వాదించా’’ అని 58 ఏళ్ల రీడ్‌ తెలిపాడు. 2019లో కోచ్‌ బాధ్యతలు చేపట్టిన రీడ్‌ పదవి కాలం వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌ వరకు ఉంది. అతడితో పాటు వ్యూహాత్మక కోచ్‌ గ్రెగ్‌ క్లార్క్‌, శాస్త్రీయ సలహాదారు మిచెల్‌ డేవిడ్‌ కూడా రాజీనామా చేశారు. గ్రాహం హయాంలో భారత్‌ చిరస్మరణీయ విజయాలు సాధించింది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌ (టోక్యో)లో కాంస్యం గెలవడమే కాక కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం సొంతం చేసుకుంది. 2021-22 సీజన్లో హాకీ ప్రొ లీగ్‌లో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ అయిదో ర్యాంకులో ఉన్న భారత్‌.. సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో మాత్రం కనీసం క్వార్టర్‌ఫైనల్స్‌ చేరలేకపోయింది. అర్జెంటీనాతో కలిసి ఉమ్మడిగా తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు