ఇక్కడే ఆగను

ఆడాలన్న ఉత్సాహం తనలో చాలా ఉందని, ఇక్కడే ఆగిపోవాలనుకోవట్లేదని ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత నొవాక్‌ జకోవిచ్‌ అన్నాడు.

Published : 31 Jan 2023 02:52 IST

మెల్‌బోర్న్‌: ఆడాలన్న ఉత్సాహం తనలో చాలా ఉందని, ఇక్కడే ఆగిపోవాలనుకోవట్లేదని ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత నొవాక్‌ జకోవిచ్‌ అన్నాడు. ‘‘ఆడాలన్న తపన, ఉత్సాహం నాలో ఇంకా ఉన్నాయి. ఇంతదూరం వెళ్తానో చూద్దాం. నేనైతే ఇక్కడే ఆగిపోవాలనుకోవట్లేదు. ఆ ఉద్దేశం నాకు లేదు’’ అని ఫైనల్లో సిట్సిపాస్‌ను ఓడించిన అనంతరం అతడు వ్యాఖ్యానించాడు. అయితే ఎంతకాలం ఆడతానో, ఎన్ని గ్రాండ్‌స్లామ్స్‌ ఆడతానో చెప్పలేనని, అది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు