వాళ్లు భారత జట్టుకు ఆడతారు

అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ విజేత జట్టు నుంచి ముగ్గురు, నలుగురు క్రికెటర్లు భారత్‌కు ఆడతారని మాజీ కెప్టెన్‌ మిథాలి రాజ్‌ అభిప్రాయపడింది.

Published : 31 Jan 2023 02:52 IST

దిల్లీ: అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ విజేత జట్టు నుంచి ముగ్గురు, నలుగురు క్రికెటర్లు భారత్‌కు ఆడతారని మాజీ కెప్టెన్‌ మిథాలి రాజ్‌ అభిప్రాయపడింది. ఇంగ్లాండ్‌తో ఫైనల్లో లెగ్‌ స్పిన్నర్‌ పార్శవి చోప్రా, ఓపెనర్‌ శ్వేత సెహ్రావత్‌, పేసర్‌ తితాస్‌ సాధు, ఆఫ్‌ స్పిన్‌ బౌలర్‌ అర్చన దేవి, ఎడమచేతి వాటం స్పిన్నర్‌ మన్నత్‌ కశ్యప్‌ సత్తాచాటారు. ‘‘స్పిన్నర్లు, పేసర్లు ఆకట్టుకున్నారు. సీనియర్‌ స్థాయిలో ఈ రెండు విభాగాల్లో మెరుగవడం అవసరం. వచ్చే వన్డే ప్రపంచకప్‌లో భారత్‌లో జరుగుతుంది. ఇప్పటి వరకు సీనియర్‌ స్థాయిలో ప్రపంచ టోర్నీ గెలవలేదు. ప్రపంచకప్‌కు బీసీసీఐ ప్రాధాన్యతనిచ్చి సీనియర్‌ జట్టులో అడేందుకు సిద్ధంగా ఉన్న.. అండర్‌-19 క్రికెటర్లను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుందని అనుకుంటున్నా’’ అని మిథాలి వివరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు