డబ్ల్యూపీఎల్‌తో ముఖచిత్రం మారుతుంది

మహిళల కోసం బీసీసీఐ ఆరంభిస్తున్న లీగ్‌తో అమ్మాయిల క్రికెట్‌ ముఖచిత్రమే మారిపోతుందని భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అభిప్రాయపడింది.

Published : 01 Feb 2023 04:47 IST

దిల్లీ: మహిళల కోసం బీసీసీఐ ఆరంభిస్తున్న లీగ్‌తో అమ్మాయిల క్రికెట్‌ ముఖచిత్రమే మారిపోతుందని భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అభిప్రాయపడింది. ‘‘పురుషుల క్రికెట్‌ ఐపీఎల్‌ రాకతో ఎంతో మెరుగుపడింది. యువ ప్రతిభావంతులు ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. మహిళల క్రికెట్లోనూ డబ్ల్యూపీఎల్‌ రాకతో అలాగే జరుగుతుందని ఆశిస్తున్నా. మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఈ లీగ్‌కు పేరొస్తుందనుకుంటున్నా. ఈ టోర్నీలో ఎంతోమంది ప్రతిభావంతులైన అమ్మాయిలను చూస్తాం. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు మధ్య అంతరం డబ్ల్యూపీఎల్‌ వల్ల తగ్గుతుంది. ప్రస్తుతం దేశవాళీల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న అమ్మాయిలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. డబ్ల్యూపీఎల్‌ ఆడాక మన అమ్మాయిలు వేగంగా అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమవుతారు’’ అని హర్మన్‌ పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని