పర్యవేక్షక కమిటీలో బబిత

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై వచ్చిన వివిధ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన పర్యవేక్షక కమిటీలో కొత్తగా బబిత ఫొగాట్‌ను చేర్చారు.

Published : 01 Feb 2023 04:47 IST

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై వచ్చిన వివిధ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన పర్యవేక్షక కమిటీలో కొత్తగా బబిత ఫొగాట్‌ను చేర్చారు. వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా, సాక్షి మలిక్‌, రవి దహియా వంటి అగ్రశ్రేణి అథ్లెట్లు బ్రిజ్‌భూషణ్‌, డబ్ల్యూఎఫ్‌ఐకి వ్యతిరేకంగా నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు క్రీడల మంత్రిత్వ శాఖ ఇంతకుముద]ు ప్రకటించింది. మాజీ రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌, మాజీ షట్లర్‌ తృప్తి ముర్గుండె, రాధిక శ్రీరామ్‌, రాజేశ్‌ రాజగోపాలన్‌ ఈ కమిటీలో ఇతర సభ్యులు. అయితే ఈ కమిటీ ఏర్పాటుకు ముందు తమను సంప్రదించలేదని రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆరో సభ్యురాలిగా బబిత చేరింది. కమిటీలో ఆమెను చేరుస్తున్నట్లు క్రీడల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బ్రిజ్‌భూషణ్‌ లైంగిక వేధింపులతో పాటు అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా అతడి నియంతృత్వ ధోరణిని రెజ్లర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డబ్ల్యూఎఫ్‌ఐ రోజువారీ వ్యవహారాలను ప్రస్తుతం పర్యవేక్షక కమిటీనే చూస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు