రెండో స్థానానికి దీప్తి

దుబాయ్‌: ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ (737 పాయింట్లు) పురోగతి సాధించింది. మంగళవారం ప్రకటించిన జాబితాలో దీప్తి 2 స్థానాలు మెరుగుపరుచుకుని రెండో ర్యాంకు సాధించింది.

Published : 01 Feb 2023 02:40 IST

దుబాయ్‌: ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ (737 పాయింట్లు) పురోగతి సాధించింది. మంగళవారం ప్రకటించిన జాబితాలో దీప్తి 2 స్థానాలు మెరుగుపరుచుకుని రెండో ర్యాంకు సాధించింది. సోఫీ ఎకిల్‌స్టోన్‌ (763- ఇంగ్లాండ్‌) అగ్రస్థానంలో కొనసాగుతోంది. రేణుక సింగ్‌ ఏడో స్థానానికి పడిపోయింది. రాజేశ్వరి గైక్వాడ్‌ నాలుగు స్థానాలు మెరుగై 14వ ర్యాంకు సాధించింది. టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన 3, షెఫాలి వర్మ 8, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 12, జెమీమా రోడ్రిగ్స్‌ 13వ స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ రెండో ర్యాంకులో కొనసాగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు