నాణ్యమైన సన్నద్ధత ఇవ్వకపోతే ఎలా?

తమ దేశంలో పర్యటించే జట్లకు నాణ్యమైన సన్నద్ధత ఇవ్వడానికి భారత్‌ ఇష్టపడదని, ఇది తనకు నచ్చని విషయమని ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్‌ ఇయాన్‌ హీలీ చెప్పాడు.

Published : 01 Feb 2023 02:40 IST

మెల్‌బోర్న్‌: తమ దేశంలో పర్యటించే జట్లకు నాణ్యమైన సన్నద్ధత ఇవ్వడానికి భారత్‌ ఇష్టపడదని, ఇది తనకు నచ్చని విషయమని ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్‌ ఇయాన్‌ హీలీ చెప్పాడు. టూర్‌ మ్యాచ్‌ల్లో పచ్చిక పిచ్‌లపై ఆడిస్తారని, అసలు మ్యాచ్‌ల్లో స్పిన్‌ పిచ్‌లు ఎదురవుతాయని తాజాగా ఆసీస్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా చేసిన వ్యాఖ్యలు నిజమే అని హీలీ అన్నాడు. ‘‘తమ దేశంలో పర్యటించే జట్లకు నాణ్యమైన సన్నద్ధత కల్పించడానికి భారత్‌ ఇష్టపడదు. అందుకే ఈ విషయంలో వాళ్లపై విశ్వాసం లేదు. ఇలాంటి చర్యలు రెండు దేశాల మధ్య బంధాన్ని దెబ్బ తీస్తాయి. భారత్‌ పర్యటన కోసం అందుబాటులో ఉన్న స్పిన్నర్లను సిడ్నీలో జరుగుతున్న జాతీయ శిబిరానికి రప్పించాం. నెట్‌ ప్రాక్టీస్‌తో జట్టు తాజాగా కనబడుతోంది. భారత్‌లో విజయవంతం అవుతామని ఆసీస్‌ నమ్మకంతో ఉంది. రెండు, మూడు టెస్టుల మధ్య ఒక మూడు రోజుల మ్యాచ్‌ ఉంటే బాగుంటుందని భావిస్తున్నా’’ అని హీలీ పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు