లఖ్‌నవూ పిచ్‌ క్యురేటర్‌పై వేటు

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య భారెండో టీ20 మ్యాచ్‌కు పేలవమైన పిచ్‌ను సిద్ధం చేసిన ఏకనా స్టేడియం క్యురేటర్‌పై వేటు పడింది.

Published : 01 Feb 2023 02:40 IST

దిల్లీ: భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య భారెండో టీ20 మ్యాచ్‌కు పేలవమైన పిచ్‌ను సిద్ధం చేసిన ఏకనా స్టేడియం క్యురేటర్‌పై వేటు పడింది. ఉత్తర్‌ప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (యూపీసీఏ) అతడిని క్యురేటర్‌ బాధ్యతల నుంచి తొలగించింది. ఆ మ్యాచ్‌లో కివీస్‌ను 99/8 స్కోరుకు కట్టడి చేసిన టీమ్‌ఇండియా.. చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి 19.5 ఓవర్లు ఆడింది. లఖ్‌నవూ పిచ్‌ షాక్‌కు గురిచేసిందంటూ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య విస్మయం వ్యక్తంజేశాడు. ‘‘క్యురేటర్‌ను తొలగించాం. అనుభజ్ఞుడైన సంజీవ్‌కుమార్‌ అగర్వాల్‌ను అతని స్థానంలో నియమించాం. నెల రోజుల్లో పరిస్థితుల్ని చక్కదిద్దుతాం. టీ20కి ముందు మధ్య వికెట్లపై చాలా దేశవాళీ మ్యాచ్‌లు జరిగాయి. అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం క్యురేటర్‌ ఒకటి, రెండు పిచ్‌లను వదలాల్సింది. పిచ్‌లను ఎక్కువగా వాడేశారు. వాతావరణం కూడా బాగా లేకపోవడంతో కొత్త వికెట్‌ తయారీకి తగినంత సమయం లేకపోయింది’’ అని యూపీసీఏ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని