క్రీడల బడ్జెట్‌ 3397 కోట్లు

దేశంలో క్రీడలకు ఊతం. అథ్లెట్లు ఆసియా క్రీడలు, 2024 ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్రం. బడ్జెట్లో క్రీడా రంగానికి కేటాయింపులు పెంచింది.

Published : 02 Feb 2023 02:49 IST

దిల్లీ: దేశంలో క్రీడలకు ఊతం. అథ్లెట్లు ఆసియా క్రీడలు, 2024 ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్రం. బడ్జెట్లో క్రీడా రంగానికి కేటాయింపులు పెంచింది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఆటల కోసం రూ.3,397.32 కోట్లు ఇచ్చింది. గత ఏడాది కంటే ఇది రూ.723.97 కోట్లు ఎక్కువ. ఖేలో ఇండియాకు రూ.1,045 కోట్ల నిధులు అందించనున్నారు. గత ఏడాది కంటే రూ.439 కోట్లు ఎక్కువగా కేటాయించిందంటే ఈ పథకానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌)కు 2023-24 సంవత్సరానికి రూ.785.43 కోట్లు కేటాయించారు. సాయ్‌ అథ్లెట్లకు జాతీయ శిబిరాలు నిర్వహించడంతో పాటు వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. అథ్లెట్లకు పరికరాలు ఇవ్వడం, కోచ్‌ల నియమించడం, క్రీడా మౌలిక సదుపాయాల నిర్వహణ లాంటి ఇతర విధులనూ సాయ్‌ నిర్వర్తిస్తుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని