అగ్రస్థానాల్లోనే సూర్య, సిరాజ్‌

టీమ్‌ఇండియా విధ్వంసక బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గానే కొనసాగుతున్నాడు.

Updated : 02 Feb 2023 04:24 IST

దుబాయ్‌: టీమ్‌ఇండియా విధ్వంసక బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గానే కొనసాగుతున్నాడు. బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 908 పాయింట్లతో సూర్య అగ్రస్థానంలో ఉన్నాడు. మహ్మద్‌ రిజ్వాన్‌ (836- పాకిస్థాన్‌) ద్వితీయ, డెవాన్‌ కాన్వే (788- న్యూజిలాండ్‌) తృతీయ ర్యాంకులు సాధించారు. విరాట్‌ కోహ్లి 14, కేఎల్‌ రాహుల్‌ 25, రోహిత్‌శర్మ 28వ స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ఒక్క భారత బౌలర్‌ కూడా లేడు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్య మూడో ర్యాంకులో ఉన్నాడు. వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో మహ్మద్‌ సిరాజ్‌ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో శుబ్‌మన్‌ గిల్‌ 6, కోహ్లి 7, రోహిత్‌ 9వ స్థానాల్లో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు