యువ ఛాంపియన్లకు సత్కారం

అండర్‌-19 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత అమ్మాయిలను మూడో టీ20కి ముందు బీసీసీఐ సత్కరించింది.

Published : 02 Feb 2023 02:52 IST

అండర్‌-19 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత అమ్మాయిలను మూడో టీ20కి ముందు బీసీసీఐ సత్కరించింది. ముందే ప్రకటించిన రూ.5 కోట్ల నజరానాకు సంబంధించి చెక్కును సచిన్‌ చేతుల మీదుగా షెఫాలి బృందానికి అందించింది. ‘‘అద్భుతమైన ఘనత సాధించిన అమ్మాయిలకు అభినందనలు. కొన్నేళ్ల పాటు దేశం మొత్తం ఈ గెలుపు సంబరాలు చేసుకుంటుంది. 1983 (పురుషుల జట్టుకు తొలి ప్రపంచకప్‌)లో నా క్రికెట్‌ కల మొదలైంది. కానీ ఇప్పుడీ ప్రపంచకప్‌ గెలిచిన అమ్మాయిలు ఎంతో మంది స్వప్నాలకు బీజం వేశారు. దేశానికి ప్రాతినిథ్యం వహించాలని యువతులు కల కనేలా చేశారు. మహిళల క్రికెట్‌ ఎదుగుదలకు బీసీసీఐ శ్రమిస్తోంది. భవిష్యత్‌లో మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి’’ అని ఈ సందర్భంగా సచిన్‌ తెలిపాడు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, కోశాధికారి ఆశిష్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమ్మాయిలు మ్యాచ్‌ను వీక్షించారు. వీరిని మైదానంలో జీప్‌లపైనా ఊరేగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు