క్వార్టర్స్‌లో ప్రణీత్‌

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత స్టార్‌ షట్లర్‌ సాయిప్రణీత్‌ క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో ప్రణీత్‌ 24-22, 7-21, 22-20తో హెయిక్‌ జిన్‌ (కొరియా)పై కష్టపడి గెలిచాడు.

Published : 03 Feb 2023 03:47 IST

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత స్టార్‌ షట్లర్‌ సాయిప్రణీత్‌ క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో ప్రణీత్‌ 24-22, 7-21, 22-20తో హెయిక్‌ జిన్‌ (కొరియా)పై కష్టపడి గెలిచాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ప్రణీత్‌ తొలి గేమ్‌ను అతికష్టం మీద గెలిచి.. రెండో గేమ్‌ను ప్రత్యర్థికి కోల్పోయాడు. మూడో గేమ్‌లోనూ జిన్‌ నుంచి సాయికి గట్టిపోటీ ఎదురైంది. కానీ కీలక సమయంలో నిలిచిన అతడు విజయాన్ని అందుకున్నాడు. ఇతర ప్రిక్వార్టర్స్‌లో లీ చెంక్‌ (హాంకాంగ్‌)పై కిరణ్‌ జార్జ్‌ 22-20, 15-21, 20-22తో తలొంచగా.. మహిళల సింగిల్స్‌లో డెన్‌ హోజ్‌మార్క్‌ (డెన్మార్క్‌)పై అస్మిత 21-19, 13-21, 27-29తో పోరాడి ఓడింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఇషాన్‌-తనీషా 19-21, 16-21తో అక్బర్‌-ఇస్లామి (ఇండోనేషియా) చేతిలో.. సిక్కిరెడ్డి-రోహన్‌ 11-21, 10-21తో ఫెంగ్‌-హంగ్‌ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని