అలా అయితే మేమూ గెలుస్తాం

భారత్‌లో న్యాయమైన పిచ్‌లను తయారు చేస్తే ఆస్ట్రేలియా కూడా గెలవగలదని ఆ జట్టు మాజీ ఆటగాడు ఇయాన్‌ హీలీ అన్నాడు.

Published : 03 Feb 2023 03:47 IST

మెల్‌బోర్న్‌: భారత్‌లో న్యాయమైన పిచ్‌లను తయారు చేస్తే ఆస్ట్రేలియా కూడా గెలవగలదని ఆ జట్టు మాజీ ఆటగాడు ఇయాన్‌ హీలీ అన్నాడు. ‘‘భారత్‌లో పిచ్‌లు ఎప్పటిలా ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలించి ఆ తర్వాత రోజులు గడిచేకొద్ది బంతి స్పిన్‌ తిరిగితే ఆస్ట్రేలియా కూడా నెగ్గుతుంది. కానీ ఇక్కడ మేం ఆడిన గత సిరీస్‌లో తొలిరోజు నుంచే బంతి విపరీతంగా స్పిన్‌ అయింది. అసాధారణంగా బౌన్స్‌ అయింది. తక్కువ ఎత్తులో దూసుకెళ్లింది. మళ్లీ ఇలాంటి పిచ్‌లు ఎదురైతే తొలి టెస్టులో మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లైయన్‌ ఎలా బంతులేస్తారనేదే ఆందోళనగా ఉంది. ఇలాంటి అనూహ్య పిచ్‌లపై ఆస్ట్రేలియా కంటే టీమ్‌ఇండియా బాగా ఆడగలదు’’ అని హీలీ అన్నాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో పచ్చిక పిచ్‌లపై ఆడించి అసలు మ్యాచ్‌లకు పూర్తిగా స్పిన్‌ పిచ్‌లు తయారు చేస్తున్నారన్న కారణంతో భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు సన్నాహక మ్యాచ్‌లు ఆడకూడదని ఆస్ట్రేలియా నిర్ణయించుకుంది. స్పిన్‌ పిచ్‌లు ఎదురైన ఆస్ట్రేలియాకు విజయం సాధించే అవకాశముందని అయితే ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడిని అధిగమించి.. క్యాచ్‌లను వదిలేయకుండా జాగ్రత్తపడాలని సూచించాడు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ఫిబ్రవరి 9న ఆరంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని