ధోని పోషించిన పాత్ర నా బాధ్యత
ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాల్ని సంపాదించినట్లు టీమ్‌ఇండియా టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు. దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని జట్టు కోసం పోషించిన పాత్రను స్వీకరించడం తన బాధ్యత అని తెలిపాడు.
అహ్మదాబాద్: ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాల్ని సంపాదించినట్లు టీమ్‌ఇండియా టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు. దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని జట్టు కోసం పోషించిన పాత్రను స్వీకరించడం తన బాధ్యత అని తెలిపాడు. ‘‘నిజాయతీగా చెప్పాలంటే సిక్సర్లు కొట్టడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా. కాని పరిణతి సాధించాలి. అదే జీవితం. భాగస్వామ్యాలను నిర్మించడం ముఖ్యమని నేను నమ్ముతాను. అందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముంది. క్రీజులో ఉన్నంతసేపు జట్టుకు, అవతలి వైపు ఉన్న వ్యక్తికి నేనున్నాను అనే భరోసా, ప్రశాంతత ఇవ్వాలని అనుకుంటున్నా. జట్టులో ఉన్నవాళ్లందరి కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవం నాకే ఉంది. అనుభవం కంటే కూడా ఒత్తిడిని ఎలా స్వీకరించాలో.. ఏ విధంగా అధిగమించాలో నేర్చుకున్నా. కాబట్టి జట్టు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. జట్టు కోసం ధోని పోషించిన పాత్రను స్వీకరించడం నా బాధ్యత. అందుకోసం నా స్ట్రైక్‌రేటు తగ్గించుకోడానికి సిద్ధం. కొత్త అవకాశాల్ని అందుకోవడం.. నూతన బాధ్యతల్ని తీసుకోవడం కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నా. ధోని మాదిరి బ్యాటింగ్ ఆర్డర్‌లో కింద వచ్చి అతని పాత్ర పోషించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ధోని సారథిగా ఉన్నప్పుడు నేను చిన్నవాడిని. మైదానం నలుమూలలా సిక్సర్లు బాదేవాడిని. ధోని వీడ్కోలు పలకడంతో సహజంగానే ఆ బాధ్యత నాపై పడింది. అందుకు నేను వెనుకాడను. ప్రస్తుతం మేం కోరుకున్నట్లుగా ఫలితాలు వస్తున్నాయి. అర్ష్‌దీప్‌సింగ్‌పై ఒత్తిడి రాకుండా ఉండేందుకే టీ20ల్లో కొత్త బంతితో బౌలింగ్ చేస్తున్నా’’ అని హార్దిక్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nimmagadda: ప్రజాస్వామ్యం బలహీన పడేందుకు అంతర్గత శత్రువులే కారణం: నిమ్మగడ్డ
-
Asian Games: భారత్ ఖాతాలోకి రెండు స్వర్ణాలు
-
GVL Narasimha Rao: దసరా లోపు విశాఖ - వారణాసి రైలు: జీవీఎల్
-
Shruti Haasan: ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం.. శ్రుతి హాసన్ ఎమోషనల్ పోస్ట్
-
Delhi Robbery: ₹ 1400 పెట్టుబడితో ₹ 25 కోట్లు కొట్టేద్దామనుకున్నారు
-
Avanigadda: మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్నా?: వారాహి యాత్రలో నిరుద్యోగుల ఆవేదన