భారత్‌ 1 ..డెన్మార్క్‌ 1

హిలెరాడ్‌ (డెన్మార్క్‌): ప్రతిష్టాత్మక డేవిస్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నీలో డెన్మార్క్‌తో ప్రపంచ గ్రూప్‌-1 మ్యాచ్‌ను భారత్‌ తొలి రోజును సమానంగా ముగించింది.

Published : 04 Feb 2023 02:43 IST

డేవిస్‌ కప్‌ పోరు

హిలెరాడ్‌ (డెన్మార్క్‌): ప్రతిష్టాత్మక డేవిస్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నీలో డెన్మార్క్‌తో ప్రపంచ గ్రూప్‌-1 మ్యాచ్‌ను భారత్‌ తొలి రోజును సమానంగా ముగించింది. తొలి సింగిల్స్‌లో యుకి ఓడినా.. రెండో సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్‌ విజయం సాధించి జట్టును పోటీలోకి తెచ్చాడు. యుకి బాంబ్రి ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ హోల్గర్‌ రూనీకి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. అతను 2-6, 2-6తో చిత్తుగా ఓడాడు. 19 ఏళ్ల రూనీ 58 నిమిషాల్లోనే యుకి కథ ముగించాడు. రెండు సెట్లలోనూ అతను రెండేసిసార్లు యుకి సర్వీస్‌ను బ్రేక్‌చేశాడు. యుకి ఒక్కసారి కూడా ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేయలేకపోయాడు. హోరాహోరీగా సాగిన రెండో సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్‌ పోరాడి గెలిచాడు. మూడు సెట్ల పోరులో సుమిత్‌ 4-6, 6-3, 6-4తో హామ్‌గ్రెన్‌ అగస్ట్‌పై విజయం సాధించాడు. డబుల్స్‌ మ్యాచ్‌, రివర్స్‌ సింగిల్స్‌ శనివారం జరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని