స్లిప్‌ ఫీల్డింగ్‌పై...

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో స్లిప్‌ ఫీల్డింగ్‌పై ప్రధానంగా దృష్టిసారించినట్లు టీమ్‌ఇండియా చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు.

Updated : 06 Feb 2023 02:57 IST

నాగ్‌పుర్‌: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో స్లిప్‌ ఫీల్డింగ్‌పై ప్రధానంగా దృష్టిసారించినట్లు టీమ్‌ఇండియా చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. సన్నాహక శిబిరంలో స్లిప్‌ ఫీల్డింగ్‌ బలోపేతానికి ప్రయత్నిస్తున్నట్లు ద్రవిడ్‌ తెలిపాడు. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈనెల 9న నాగ్‌పుర్‌లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. ‘‘జట్టులో అందరూ మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారు. టెస్టు జట్టంతా మళ్లీ ఒకచోట కలవడం ఆనందంగా ఉంది. గత నెల రోజులుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ చాలా ఆడాం. పరిమిత ఓవర్ల క్రికెట్‌ నుంచి టెస్టులకు మారుతున్న ఆటగాళ్లు నెట్స్‌లో ఎక్కువ సేపు గడపడం వారికి కలిసొచ్చేదే. ప్రాక్టీస్‌ వికెట్లు కూడా బాగున్నాయి. ఫీల్డింగ్‌ మాకెంతో ముఖ్యమైన విభాగం. దగ్గరి నుంచి క్యాచ్‌లు అందుకోవడం సిరీస్‌లో ముఖ్యమైన భాగంగా భావిస్తున్నాం. టెస్టు సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌ కోసం వారం రోజుల సమయం దొరకడం మాలో ఉత్సాహాన్ని నింపింది. ఈ నాలుగైదు రోజుల్లో ఏం చేయాలన్న దానిపై నెల రోజులుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’ అని ద్రవిడ్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని