Shubman Gill: టిండర్‌లో శుభ్‌మన్‌ గిల్‌

టీమ్‌ఇండియా యువ సంచలనం శుభ్‌మన్‌ గిల్‌ డేటింగ్‌ యాప్‌ టిండర్‌లో ఖాతా తెరిచాడు. అతను టిండర్‌లో అడుగుపెట్టడం వెనుక పెద్ద కథే ఉంది.

Published : 06 Feb 2023 07:56 IST

దిల్లీ: టీమ్‌ఇండియా యువ సంచలనం శుభ్‌మన్‌ గిల్‌ డేటింగ్‌ యాప్‌ టిండర్‌లో ఖాతా తెరిచాడు. అతను టిండర్‌లో అడుగుపెట్టడం వెనుక పెద్ద కథే ఉంది. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో శుభ్‌మన్‌ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌ సందర్భంగా స్టాండ్స్‌లో ఫ్లకార్డు పట్టుకున్న ఓ మహిళా అభిమాని ఫొటో సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైంది.

‘‘టిండర్‌.. శుభ్‌మన్‌తో జత చేయు’’ అనే అర్థం వచ్చేలా ఉన్న ఫ్లకార్డును ఆమె ప్రదర్శించింది. దీంతో ఈ ఫొటోను వాడుకుంటూ నాగ్‌పుర్‌లో టిండర్‌ పెద్ద పెద్ద హోర్డింగ్స్‌ ఏర్పాటు చేసింది. ‘‘శుభ్‌మన్‌ ఇక్కడ చూడు’’ అంటూ వీటిపై రాసుకొచ్చింది. ఈ హోర్డింగ్‌ ఫొటోలను టీమ్‌ఇండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ట్విటర్‌లో పోస్టు చేసి గిల్‌ను ఆట పట్టించాడు. ‘‘మొత్తం నాగపూర్‌ చెబుతోంది. గిల్‌ ఓ సారి చూడు’’ అని ఉమేశ్‌ పోస్టు పెట్టాడు. దీంతో ఎట్టకేలకు గిల్‌ టిండర్‌లో చేరాడు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ అతను ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేశాడు. ‘‘నేను చూశా. ఇప్పుడు మీరు సరిగ్గా చూడండి. టిండర్‌ కారణంగానే ఇందులో చేరా’’ అని గిల్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు