Iftikhar Ahmed: ఇఫ్తికార్‌.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు

6 బంతుల్లో 6 సిక్సర్లు..! చాలా అరుదు. కానీ ఇటీవల కాలంలో ఈ ఫీట్‌ తరుచుగా నమోదవుతూనే ఉంది. తాజాగా 6 బంతుల్లో 6 సిక్సర్ల ఘనతను పాకిస్థాన్‌ బ్యాటర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ సాధించాడు.

Updated : 06 Feb 2023 07:13 IST

లాహోర్‌: 6 బంతుల్లో 6 సిక్సర్లు..! చాలా అరుదు. కానీ ఇటీవల కాలంలో ఈ ఫీట్‌ తరుచుగా నమోదవుతూనే ఉంది. తాజాగా 6 బంతుల్లో 6 సిక్సర్ల ఘనతను పాకిస్థాన్‌ బ్యాటర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ సాధించాడు. క్వెటా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ పెషావర్‌ జల్మీతో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో అతడు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. వాహబ్‌ రియాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లో ఇఫ్తికార్‌ వరుసగా ఆరు సిక్సర్లు బాదేశాడు. ఇప్పటిదాకా గ్యారీ సోబర్స్‌, రవిశాస్త్రి, గిబ్స్‌, యువరాజ్‌ సింగ్‌, రాస్‌ విట్లే, హజ్రతుల్లా జజాయ్‌, లీయో కార్టర్‌, పొలార్డ్‌, తిసార పెరీరా 6 బంతుల్లో 6 సిక్సర్ల రికార్డు క్లబ్‌లో ఉన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని