పాక్‌తో పోరుపైనే మా దృష్టంతా

డబ్ల్యూపీఎల్‌ వేలం దగ్గర్లోనే ఉన్నా.. తమ దృష్టంతా టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో పోరుపైనే అని భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది.

Published : 06 Feb 2023 02:04 IST

కేప్‌టౌన్‌: డబ్ల్యూపీఎల్‌ వేలం దగ్గర్లోనే ఉన్నా.. తమ దృష్టంతా టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో పోరుపైనే అని భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. అండర్‌-19 ప్రపంచకప్‌ విజయం తమలో స్ఫూర్తి రగిలించిందని చెప్పింది. ఈనెల 12న పాక్‌తో మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తన పోరాటాన్ని ప్రారంభించనుండగా.. మరుసటి రోజే ముంబయిలో డబ్ల్యూపీఎల్‌ వేలం జరగనుంది. ‘‘వేలం కంటే ముందు మాకు ముఖ్యమైన మ్యాచ్‌ ఉంది. ఆ మ్యాచ్‌పైనే మేం దృష్టిసారించబోతున్నాం. అన్నిటికంటే ప్రపంచకప్పే ముఖ్యమైనది. ఏది ముఖ్యమో.. ఎలా ఏకాగ్రతతో ఉండాలో మాకు తెలుసు. అండర్‌-19 అమ్మాయిల్లానే మేం కూడా కప్‌ సాధించాలని పట్టుదలగా ఉన్నాం. వాళ్లు మాకు ప్రేరణగా నిలిచారు. ఇక డబ్ల్యూపీఎల్‌ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాం. రానున్న రెండు, మూడు నెలలు మహిళల క్రికెట్‌కు చాలా ముఖ్యమైనవి. డబ్ల్యూబీబీఎల్‌, హండ్రెడ్‌ లీగ్‌లు ఆయా దేశాల్లో క్రికెట్‌ మెరుగవడానికి ఎలా ఉపయోగపడ్డాయో చూశాం. భారత్‌లోనూ అదే జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని హర్మన్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని