హైదరాబాద్‌ విజయం

ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ రెండో సీజన్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ శుభారంభం చేసింది. సోమవారం ఆ జట్టు 3-2 (13-15, 15-9, 15-14, 15-11, 10-15) తేడాతో గత సీజన్‌ రన్నరప్‌ అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌పై గెలిచింది.

Published : 07 Feb 2023 03:06 IST

బెంగళూరు: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ రెండో సీజన్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ శుభారంభం చేసింది. సోమవారం ఆ జట్టు 3-2 (13-15, 15-9, 15-14, 15-11, 10-15) తేడాతో గత సీజన్‌ రన్నరప్‌ అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌పై గెలిచింది. తొలి సెట్‌లో ఓటమితో మ్యాచ్‌ మొదలెట్టిన హైదరాబాద్‌ ఆ తర్వాత బలంగా పుంజుకుంది. వరుసగా మూడు సెట్లలోనూ గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. నామమాత్రమైన చివరి సెట్లో అహ్మదాబాద్‌ నెగ్గింది. హైదరాబాద్‌ తరపున ప్రశాంత్‌ (16 పాయింట్లు), ట్రెంట్‌ (8) రాణించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు