బ్యాటర్లు విఫలం

మహిళల టీ20 ప్రపంచకప్‌ తొలి వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ ఓటమి పాలైంది. బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు విఫలం కావడంతో 44 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా చేతిలో ఓడించింది.

Published : 07 Feb 2023 03:08 IST

ఆస్ట్రేలియాతో వార్మప్‌లో భారత్‌ ఓటమి

కేప్‌టౌన్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌ తొలి వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ ఓటమి పాలైంది. బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు విఫలం కావడంతో 44 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా చేతిలో ఓడించింది. సోమవారం మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ను 20 ఓవర్లలో 129/8కే టీమ్‌ఇండియా కట్టడి చేసింది. శిఖ (2/9), పూజ (2/16), రాధ (2/22) విజృంభించారు. ఛేదనలో భారత్‌ పేలవ ప్రదర్శన చేసింది. 16 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. డార్సీ బ్రౌన్‌ (4/17) ధాటికి టాప్‌ఆర్డర్‌ పెవిలియన్‌కు క్యూ కట్టింది. 22కే 4 వికెట్లు కోల్పోయి భారత జట్టు ఓటమికి బాటలు వేసుకుంది. జెమీమా, స్మృతి మంధాన డకౌట్‌ కాగా.. షెఫాలీ (2), రిచా ఘోష్‌ (5) విఫలమయ్యారు. ఆ తర్వాత ఎవరూ నిలవలేదు. దీప్తిశర్మ (19 నాటౌట్‌), హర్లీన్‌ డియోల్‌ (12), అంజలి శర్వాణి (11) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. అష్లె గార్డెనర్‌ (2/16) కూడా టీమ్‌ఇండియా పతనంలో కీలకపాత్ర పోషించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని