తేజ్‌నారాయణ్‌ డబుల్‌

వెస్టిండీస్‌ క్రికెట్‌ మేటి శివ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌ తనయుడు తేజ్‌నారాయణ్‌ (207 బ్యాటింగ్‌; 467 బంతుల్లో 16×4, 3×6) అదరగొట్టాడు.

Published : 07 Feb 2023 03:09 IST

బులవాయో: వెస్టిండీస్‌ క్రికెట్‌ మేటి శివ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌ తనయుడు తేజ్‌నారాయణ్‌ (207 బ్యాటింగ్‌; 467 బంతుల్లో 16×4, 3×6) అదరగొట్టాడు. జింబాబ్వేతో తొలి టెస్టులో అజేయ డబుల్‌ సెంచరీతో మెరిశాడు. ఓవర్‌నైట్‌ వ్యక్తిగత స్కోరు 101తో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన ఈ ఓపెనర్‌ పట్టుదలగా నిలిచాడు. మరో ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (182; 312 బంతుల్లో 18×4)తో తొలి వికెట్‌కు 336 పరుగులు జోడించాడు. వెస్టిండీస్‌ తరఫున తొలి వికెట్‌కు ఇది రికార్డు. గార్డన్‌ గ్రీనిడ్జ్‌-డెస్మండ్స్‌ హేన్స్‌ జంట పేరిట ఉన్న 33 ఏళ్ల రికార్డు (298)ను తేజ్‌, బ్రాత్‌వైట్‌ ద్వయం బద్దలు కొట్టింది. శివ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌ కూడా గతంలో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఇలా తండ్రి తనయులు డబుల్‌ సెంచరీలు చేయడం టెస్టు క్రికెట్లో ఇది రెండోసారి మాత్రమే. ఇంతకుముందు పాకిస్థాన్‌కు చెందిన హనీఫ్‌ మహ్మద్‌, షోయబ్‌ మహ్మద్‌ ఈ ఘనత సాధించారు. తేజ్‌, బ్రాత్‌వైట్‌ జోరుతో వెస్టిండీస్‌ సోమవారం 447/6 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఆట ఆఖరుకు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని