ఈ- రేసుకు ఇదే మంచి సమయం

భారత్‌లో అడుగుపెట్టేందుకు ఫార్ములా- ఈకి ఇది మంచి సమయమని భారత మాజీ ఎఫ్‌1 రేసర్‌ కరుణ్‌ చందోక్‌ అభిప్రాయపడ్డాడు.

Published : 07 Feb 2023 03:10 IST

దిల్లీ: భారత్‌లో అడుగుపెట్టేందుకు ఫార్ములా- ఈకి ఇది మంచి సమయమని భారత మాజీ ఎఫ్‌1 రేసర్‌ కరుణ్‌ చందోక్‌ అభిప్రాయపడ్డాడు. శనివారం దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఫార్ములా- ఈ రేసు జరగనుంది. 2014 ఫార్ములా- ఈ ఆరంభ సీజన్‌లో మహీంద్రా తరపున కరుణ్‌ రేసులో పాల్గొన్నాడు. ఎఫ్‌1లో ప్రాతినిథ్యం వహించిన ఇద్దరు భారత రేసర్లలో అతనొకడు. ‘‘హైదరాబాద్‌లో తొలి ఈ- ప్రి రేసుతో ఈ వారమే ఫార్ములా- ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మొదటిసారి భారత్‌లో అడుగుపెడుతుంది. స్వదేశంలో ఈ ఛాంపియన్‌షిప్‌ కోసం ఆసక్తితో ఉన్నా. విద్యుత్‌ కార్లతో సాగే ఫార్ములా- ఈ ఛాంపియన్‌షిప్‌ భారత్‌కు రావడానికి ఇదే మంచి సమయం. మహీంద్రా, టాటా (జాగ్వర్‌) ఇందులో భాగంగా ఉన్నాయి. శాశ్వత ట్రాక్‌లపై కాకుండా నగరాల్లోని స్ట్రీట్‌ సర్క్యూట్‌లపై ఈ రేసులు ఎక్కువగా జరుగుతుండడం విశేషం.  హైదరాబాద్‌లో ఆసక్తి రేపుతోన్న ట్రాక్‌పై పోటీపడడాన్ని రేసర్లు ఆస్వాదిస్తారనుకుంటున్నా. హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ఈ ట్రాక్‌ ఏర్పాటుతో తెలంగాణ ప్రభుత్వం మంచి పని చేసింది’’ అని కరుణ్‌ పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు