ముగ్గురు స్పిన్నర్లను ఆడించొచ్చు: కేఎల్‌ రాహుల్‌

తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న నాగ్‌పుర్‌ పిచ్‌ను అంచనా వేయడం అంత సులువు కాదని టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు.

Published : 08 Feb 2023 03:10 IST

నాగ్‌పుర్‌: తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న నాగ్‌పుర్‌ పిచ్‌ను అంచనా వేయడం అంత సులువు కాదని టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. గురువారం ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను ఆడించే   అవకాశముందని తెలిపాడు. ‘‘తుది జట్టును ఇంకా నిర్ణయించలేదు. 11 మంది ఎంపిక చాలా కఠినమైన నిర్ణయం కానుంది. కొందరు ఆటగాళ్లు అత్యుత్తమంగా ఆడారు. కొన్ని స్థానాలకు చర్చలు జరుగుతున్నాయి. ఆటగాళ్లతో మాట్లాడుతున్నాం. నాగ్‌పుర్‌ పిచ్‌ను చూశాం. ఇప్పుడే పిచ్‌పై అంచనాకు రావడం తొందరపాటు     అవుతుంది. భారత్‌లో ఉన్నాం కాబట్టి ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని ఉంది. అవసరమైతే మిడిలార్డర్‌లో ఆడటానికి నేను సిద్ధం’’ అని రాహుల్‌ పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు