బ్యాలెన్స్‌.. రెండు దేశాల తరఫున శతకాలు

జింబాబ్వే బ్యాటర్‌ గారీ బ్యాలెన్స్‌ అరుదైన ఘనత సాధించాడు. కెప్లెర్‌ వెసెల్స్‌ తర్వాత రెండు దేశాల తరఫున టెస్టు శతకం సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.

Published : 08 Feb 2023 03:11 IST

దిల్లీ: జింబాబ్వే బ్యాటర్‌ గారీ బ్యాలెన్స్‌ అరుదైన ఘనత సాధించాడు. కెప్లెర్‌ వెసెల్స్‌ తర్వాత రెండు దేశాల తరఫున టెస్టు శతకం సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. జింబాబ్వే తరఫున తొలి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న బ్యాలెన్స్‌.. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో నాలుగో రోజు, మంగళవారం 137 పరుగులతో అజేయంగా నిలిచాడు. జింబాబ్వేలో పుట్టిన గారీ ఇంతకుముందు ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ దేశం తరఫున నాలుగు సెంచరీలు సాధించాడు. వెసెల్స్‌ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల తరఫున శతకాలు కొట్టాడు. ఇప్పుడు బ్యాలెన్స్‌ రాణించడంతో జింబాబ్వే 379/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని