గిల్‌.. 168 స్థానాలు పైకి

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. గత ఏడాది నంబర్‌వన్‌ అయిన దగ్గర్నుంచి సూర్య దాన్ని నిలబెట్టుకుంటూ సాగుతున్నాడు.

Published : 09 Feb 2023 01:43 IST

దుబాయ్‌: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. గత ఏడాది నంబర్‌వన్‌ అయిన దగ్గర్నుంచి సూర్య దాన్ని నిలబెట్టుకుంటూ సాగుతున్నాడు. అతడి  ఖాతాలో ప్రస్తుతం 906 రేటింగ్‌ పాయింట్లున్నాయి. ఇటీవలే టీ20 జట్టులో స్థానం సంపాదించిన శుభ్‌మన్‌ గిల్‌ 30వ  స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతను మెరుపు శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ తర్వాత అతను 168 స్థానాలు మెరుగవడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని