వ్రితికి మరో పతకం

ఖేలో ఇండియా యూత్‌ క్రీడల్లో తెలంగాణ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ మరో పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే 800 మీటర్ల ఫ్రీస్టైల్‌లో పసిడి నెగ్గిన ఆమె.. బుధవారం 400మీ. ఫ్రీస్టైల్‌లో రజతం సొంతం చేసుకుంది.

Published : 09 Feb 2023 01:43 IST

భోపాల్‌: ఖేలో ఇండియా యూత్‌ క్రీడల్లో తెలంగాణ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ మరో పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే 800 మీటర్ల ఫ్రీస్టైల్‌లో పసిడి నెగ్గిన ఆమె.. బుధవారం 400మీ. ఫ్రీస్టైల్‌లో రజతం సొంతం చేసుకుంది. 4 నిమిషాల 39.28 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక అమ్మాయిలు హషిక (4:37.84ని) స్వర్ణం, అష్మిత (4:41.36ని) కాంస్యం నెగ్గారు. పురుషుల 400మీ. వ్యక్తిగత మెడ్లీలో సాయి నిహార్‌ (4:43.81ని) కాంస్యం కైవసం చేసుకున్నాడు. యుగ్‌ (రాజస్థాన్‌- 4:38.12ని), శుభోజిత్‌ (బెంగాల్‌- 4:40.69ని) వరుసగా స్వర్ణ, రజత పతకాలు గెలిచారు. రోయింగ్‌ క్వాడ్రపుల్‌ స్కల్‌ విభాగంలో తెలంగాణకు కాంస్యం దక్కింది. శ్రావణ్‌ కుమార్‌, సాయి వరుణ్‌, గణేశ్‌, జ్ఞానేశ్వర్‌తో కూడిన జట్టు 3 నిమిషాల 31.28 సెకన్లలో రేసు ముగించి మూడో స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్‌ (3:17.39ని), ఒడిషా (3:17.90ని) వరుసగా స్వర్ణ, రజత పతకాలు గెలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని