David warner: 2024 వరకు ఆడతా: వార్నర్‌

తన టెస్టు కెరీర్‌కు ముగింపు పలకాలని సెలెక్టర్లు నిర్ణయిస్తే.. 2024 వరకు పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడతానని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తెలిపాడు.

Updated : 24 Feb 2023 10:21 IST

సిడ్నీ: తన టెస్టు కెరీర్‌కు ముగింపు పలకాలని సెలెక్టర్లు నిర్ణయిస్తే.. 2024 వరకు పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడతానని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తెలిపాడు. ఈ ఏడాది యాషెస్‌ సిరీస్‌లో జట్టుకు ఎంపికవుతానన్న ఆశాభావం వ్యక్తంజేశాడు. మోచేతి గాయం కారణంగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించిన వార్నర్‌ గురువారం స్వదేశానికి చేరుకున్నాడు. టీమ్‌ఇండియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో వార్నర్‌ విఫలమయ్యాడు. వరుసగా 1, 10, 15 స్కోర్లు రాబట్టాడు. కంకషన్‌ కారణంగా దిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను ఆడలేదు. ‘‘2024 వరకు ఆడతానని ఎప్పుడూ చెబుతుంటా. టెస్టుల్లో నా స్థానానికి అర్హుడిని కాదని సెలెక్టర్లు భావిస్తే ఫర్వాలేదు. అప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌పై పూర్తిగా దృష్టిసారిస్తా. రాబోయే 12 నెలల్లో జట్టు చాలా క్రికెట్‌ ఆడనుంది. పరుగులు సాధిస్తున్నంత కాలం నా స్థానాన్ని కాపాడుకోగలను. అది జట్టుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. 36 నుంచి 37వ పడిలోకి వెళ్తున్న ఆటగాడి పట్ల విమర్శలు సహజం. గతంలో మాజీ ఆటగాళ్ల విషయంలోనూ ఇలాగే జరిగింది’’ అని వార్నర్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని