Jasprit Bumrah: బుమ్రా.. ఇంకో ఆర్నెల్లు ఔట్

వెన్ను గాయం జస్‌ప్రీత్‌ బుమ్రా కెరీర్‌పై తీవ్ర ప్రభావమే చూపేలా కనిపిస్తోంది. గత ఏడాది కాలంలో ఈ గాయంతో కొన్ని రోజులు మాత్రమే క్రికెట్‌ ఆడిన అతను.. అయిదు నెలలుగా మైదానానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

Updated : 01 Mar 2023 09:23 IST

దిల్లీ: వెన్ను గాయం జస్‌ప్రీత్‌ బుమ్రా కెరీర్‌పై తీవ్ర ప్రభావమే చూపేలా కనిపిస్తోంది. గత ఏడాది కాలంలో ఈ గాయంతో కొన్ని రోజులు మాత్రమే క్రికెట్‌ ఆడిన అతను.. అయిదు నెలలుగా మైదానానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అతను ఈ నెలాఖర్లో మొదలయ్యే ఐపీఎల్‌కు పూర్తిగా అందుబాటులో ఉండడని ఇప్పటికే తేలిపోయింది. ఆ తర్వాత కూడా అతడి పునరాగమనానికి చాలా సమయమే పట్టేలా ఉంది. బుమ్రా పూర్తిగా కోలుకోవడానికి ఇంకో ఆరు నెలలు పడుతుందని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

‘‘బుమ్రా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. శస్త్రచికిత్స చేయించుకోమని డాక్టర్లు సూచించారు. అతడి పునరాగమనానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. అప్పటికైనా అతను కచ్చితంగా తిరిగి ఆటలోకి వస్తాడని చెప్పలేం. అక్టోబరులో మొదలయ్యే వన్డే ప్రపంచకప్‌ ఆడాలన్న లక్ష్యంతో అతనున్నాడు. కానీ అది కూడా కచ్చితంగా జరుగుతుందని చెప్పలేం’’ అని ఆ అధికారి పేర్కొన్నారు. నిరుడు ఐపీఎల్‌ తర్వాత వెన్ను గాయంతో కొన్ని నెలల పాటు బుమ్రా ఆటకు దూరమయ్యాడు. తిరిగి జట్టులోకి వచ్చినా కొన్ని మ్యాచ్‌లకే మళ్లీ గాయపడ్డాడు. నిరుడు సెప్టెంబరులో ఆసియా కప్‌ నుంచి అతను మైదానానికి దూరంగా ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని