భారత బ్యాటర్లతో పిచ్‌ ఆడుకుంది: సునీల్‌ గావస్కర్‌

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమ్‌ఇండియా బ్యాటర్ల మెదళ్లతో పిచ్‌ ఆడుకుందని దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ‘‘తమ ప్రతిభకు బ్యాటర్లు న్యాయం చేయలేదు.

Updated : 04 Mar 2023 09:36 IST

ఇందౌర్‌: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమ్‌ఇండియా బ్యాటర్ల మెదళ్లతో పిచ్‌ ఆడుకుందని దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ‘‘తమ ప్రతిభకు బ్యాటర్లు న్యాయం చేయలేదు. భారత పిచ్‌లను గమనిస్తే వికెట్‌ ఫలానా విధంగా స్పందిస్తుందన్న అంచనాతో షాట్లు ఆడటం ద్వారా మన బ్యాట్స్‌మెన్‌ ఔటవుతారు. నిజానికి టీమ్‌ఇండియా బ్యాటర్లలో ఆత్మవిశ్వాసం లేదు. తొలి రెండు టెస్టుల్లో రోహిత్‌శర్మ ఆకట్టుకున్నాడు. నాగ్‌పుర్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. పరుగులు చేయలేకపోతున్నప్పుడు బ్యాటింగ్‌లో కాస్తంత అస్థిరత కనిపిస్తుంది. భారత బ్యాటర్లు అవసరమైన మేరకు వికెట్లు ముందుకొచ్చి ఆడలేకపోయారు. తమపై ఆధిపత్యం ప్రదర్శించే అవకాశాన్ని పిచ్‌కు ఇచ్చారు. దీంతో రెండు ఇన్నింగ్స్‌లలో భారత బ్యాటర్ల మెదళ్లతో పిచ్‌ ఆడుకుంది’’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని