ఆ మ్యాచ్‌లో రాహుల్‌ ఆడుంటే అతడి కెరీర్‌ ముగిసేది: మాజీ ఆటగాడు శ్రీకాంత్‌

ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు భారత జట్టులో చోటు కోల్పోవడం రాహుల్‌కు మంచే జరిగిందని భారత మాజీ ఆటగాడు శ్రీకాంత్‌ అన్నాడు.

Updated : 06 Mar 2023 06:49 IST

దిల్లీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు భారత జట్టులో చోటు కోల్పోవడం రాహుల్‌కు మంచే జరిగిందని భారత మాజీ ఆటగాడు శ్రీకాంత్‌ అన్నాడు. భారత్‌ చిత్తుగా ఓడిన ఈ మ్యాచ్‌లో ఆడుంటే రాహుల్‌ కెరీర్‌ ముగిసేదని శ్రీకాంత్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘ఆ మ్యాచ్‌లో రాహుల్‌ ఆడకపోవడం సంతోషించదగ్గ విషయమే. ఒకవేళ ఆ పిచ్‌పై ఆడి ఉంటే, చివరి రెండు టెస్టుల్లో పరుగుల బాట పట్టకపోయుంటే రాహుల్‌ కెరీర్‌ ముగిసేది. దేవుడి దయ వల్ల మ్యాచ్‌లో అతడు ఆడలేదు. అలాంటి పిచ్‌లపై బ్యాటింగ్‌ చాలా కష్టం. కోహ్లి సహా ఎవరూ అక్కడ పరుగులు చేయలేరు. ఈ పిచ్‌పై నేను బౌలింగ్‌ చేసినా వికెట్లు దక్కేవి. టెస్టులకు ఈ పిచ్‌లు మంచివి కావు’’ అని శ్రీకాంత్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని